పారిశ్రామిక వేత్తలతో కేంద్ర మంత్రి ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె రెండు వేల రూపాయల నోటుకి సంబంధించి కీలక ప్రకటన చేసారు. అదే విధంగా బడ్జెట్ కి సంబంధించి కూడా నిర్మల పలు కీలక విషయాలను వెల్లడించారు. అందరిని సంప్రదించాకే బడ్జెట్ ని ప్రవేశపెట్టామని నిర్మల అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ముంబై చెన్నై, కోల్కతా వెళ్లామని చెప్పిన నిర్మల, ఈ రోజు హైదరాబాద్ వచ్చామని, తర్వాత బెంగళూరు వెళ్తామని అన్నారు. ఒక్కో సిటీలో పారిశ్రామిక వేత్తలను కలిసి బడ్జెట్ పై చర్చిస్తున్నామని అన్నారు. 

 

వివిధ పట్టణాలు, ట్రేడ్ బాడీస్, ఎకనామిక్, పారిశ్రామిక వేత్తలతో భేటి అవుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు తగ్గలేదని అన్నారు. ఏ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలనే ఉద్దేశం ఉండదు అని నిర్మల స్పష్టం చేసారు. తెలంగాణా నుంచి కేంద్రానికి మంచి కాంట్రీబ్యూషణ్ ఉందని అన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదన్నది అవాస్తమని కొట్టిపారేశారు. ఇక ఇదిలా ఉంటే రెండు వేల నోటు రద్దు వార్త గురించి ఆమె మాట్లాడారు. రెండు వేల నోటు రద్దు అవుతుంది అనే మాటలో నిజం లేదని ఆమె స్పష్టం చేసారు. 

 

గత కొన్ని రోజులుగా రెండు వేల నోటు రద్దుపై అనేక వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకులు తీసుకోవడమే గాని ఇచ్చేది లేదని కూడా ప్రచారం జరిగింది. దీనితో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో తిరిగి ఇచ్చేసారు. ఇక వ్యాపారుల్లో కూడా మళ్ళీ ఆందోళన మొదలయింది. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా వరకు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: