తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన  ఆరు రోజుల ఐటి దాడుల సోదాల్లో  ఏమేమి బయటపెట్టాయనే విషయాలను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బయటపెట్టారు ? కాకపోతే తనకు మాత్రమే తెలిసిన  వివరాలను బయటపెట్టిన ఆర్కె తాను చెప్పేదే నిజమని జనాలను నమ్మించేందుకు నానా అవస్తలు పడ్డారు. ప్రతి ఆదివారం రాసే చెత్తపలుకులో ఐటి దాడుల నుండి చంద్రబాబునాయుడును రక్షించుకునేందుకు చాలా అవస్తలే పడ్డారు.

 

ప్రత్యర్ధులు చేసిన ఆరోపణల్లో భాగంగానే  తెలుగురాష్ట్రాల్లో ఐటి సోదాలు జరిగినట్లు అనధికారికంగా ఐటి వర్గాలు ఈయనకు చెప్పారట.   పైగా చంద్రబాబు మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో 2.5 లక్షల రూపాయలు తప్ప ఇంకేమీ దొరకలేదని ఈయనకు తెలిసిపోయింది.  రూ. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు ఆధారాలు దొరికినట్లు ఐటి శాఖ తన ప్రెస్ రిలీజ్ లో స్పష్టంగా చెప్పినా రాధాకృష్ణ మాత్రం ఒప్పుకోవటం లేదు.

 

పైగా శ్రీనివాస్ దగ్గర 2 వేల కోట్ల రూపాయలు దొరికిందని అదంతా చంద్రబాబు డబ్బే అంటూ వైసిపి జగన్మోహన్ రెడ్డి మీడియా దుష్ప్రచారం చేస్తోందని తెగ బాధపడిపోయాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శ్రీనివాస్ ఇంట్లో వేల కోట్ల రూపాయలు దొరికిందని ఎవరూ చెప్పలేదు.  అదే సమయంలో  శ్రీనివాస్ అనే వ్యక్తి కేవలం అసిస్టెంట్ సెక్రటరీ స్ధాయి వ్యక్తి మాత్రమే అంటూ వాస్తవాన్ని తప్పుదారి పట్టించేందుకు నానా అవస్తలు పడ్డాడు. పైగా చంద్రబాబు, కేసియార్ ను ఇరికించేందుకే ఐటి దాడులంటూ ప్రచారం చేశారట. జరిగిన ఐటి దాడుల్లో ఎక్కడా కేసియార్ ప్రస్తావనే లేదసలు.

 

ప్రభుత్వంలో స్ధాయి అసిస్టెంట్ సెక్రటరీ మాత్రమే అయినా చంద్రబాబు పిఎస్ హోదాలో ఏ స్ధాయిలో అధికారాలను చెలాయించిందీ అందరికీ తెలిసిందే.  రెవిన్యు శాఖలో పనిచేసే రెవిన్యు ఇన్ స్పెక్టర్ పై ఏసిబి దాడులు చేస్తేనే కోట్ల రూపాయలు దొరుకుతోంది. రెవిన్యు శాఖలో ఆర్ఐ స్ధాయి ఏంటి ? కోట్ల రూపాయలు ఎలా దొరుకుతోంది ? అన్న ఆలోచన మామూలు జనాలకు ఉండదని, తాను ఎంత చెబితే అంత నమ్మేస్తారనే బహుశా రాధాకృష్ణ నమ్మకం అయ్యుండచ్చు. ఓ ఆర్ఐ దగ్గరే కోట్ల రూపాయలు దొరుకుతున్నపుడు సిఎం దగ్గర పిఎస్ దగ్గర పనిచేసిన ఓ వ్యక్తికి ఏ స్ధాయిలో సంపాదించే అవకాశం ఉంటుంది ?

మరింత సమాచారం తెలుసుకోండి: