కృష్ణా నది అందాలు చూస్తూ మైమరిచిపోయారు. కేరింత‌లు కొడుతూ ఆనంద‌లో మునిగిపోయారు. అయితే ఇంత‌లోనే పెను విషాదం వారి త‌లుపుత‌ట్టింది. సాయం చేద్దామ‌ని వెళ్లి వాళ్లే మృత్యు కోత‌కు బ‌లైపోయారు. కాలుజారి ఓ అమ్మాయి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి నీటిలో దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..  తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కృష్ణా మండలం వాసునగర్‌ సమీపంలో కృష్ణానదిలో విషాద ఘటన జ‌రిగింది. పాలకొల్లుకు చెందిన రామకృష్ణ రాజు, శ్రీహరి రాజు బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యారు.

 

అయితే గ్రామ సమీపంలోని కృష్ణా నది వద్దకు   ఈ రోజు ఉదయం సరదాగా ఈత కొట్టేందుకు చేరుకున్నారు. అక్క‌డ‌ నీళ్లలో సరదాగా గడిపారు. స్నానాల అనంతరం బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయినా ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు మాత్రం మరికొద్దిసేపు నీళ్లలో సరదాగా గడిపి వెళ్దామని ఆగిపోయారు. ఈ నేప‌థ్యంలోనే కేరింత‌లు కొడుతూ నీళ్ల‌లో ఆడుతున్న స‌మయంలో అందులో ఓ యువ‌తి అమ్మాయి కాలుజారి నదిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు నదిలోకి దిగారు.

 

కానీ, ఆమెను వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరూ నీటమునిగారు. యువతీ యువకులు నదిలో మునిగిపోతుండగా  అక్కడ ఉన్న జాలరులు చూసి ముగ్గురు అమ్మాయిలను రక్షించారు. ఇద్దరు యువకులు మాత్రం నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక యువకులు నీటమునిగి చనిపోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గత ఈతగాళ్లను పిలిపించి, నదిలో విస్తృతంగా గాలించారు. ఈ క్ర‌మంలోనే ఇద్దరు యువకులు రామకృష్ణ, శ్రీహరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఆనందంగా, హాయిగా న‌దిలో కేరింత‌లు కొడుతూ ఉన్న ఈ ఇద్ద‌రు యువ‌కులు ఇలా యువ‌తిని కాపాడ‌బోయే వాళ్లే మృత్యు కోత‌కు బ‌లైపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: