ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం విషయంలో ప్రభుత్వం ఏ స్థాయిలో సీరియస్ గా ఉందో అందరికి తెలిసిందే. ఎన్నికల్లో పాదయాత్రలో తాను ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసారు. మద్యం షాపులను భారీగా తగ్గించి౦ది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ధరలను పెంచడంతో సామాన్యులు మద్యానికి దూరంగా ఉంటున్నారు. దొరకని వారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుగోలు చేసి తాగుతున్నారు. రాష్ట్రం మొత్తం దాదాపుగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. బార్లు, వైన్స్ షాపుల్లో కూడా మద్యం విక్రయాలు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. 

 

దీనితో సామాన్యులు ఇప్పుడు మద్యపానం విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంపాదనలో అగ్ర భాగం మద్యపానానికి పెట్టడం ఇష్టం లేక చాలా మంది మద్యం అలవాటు నుంచి బయటకు వస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకుంటున్నారు కొందరు. నాటు సారాను భారీగా విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాలలో నాటుసారా తయారి పరిశ్రమలు వెలుగులోకి వస్తున్నాయి. ప్యాకెట్ 10, 20 ఉండటం, మంచి కిక్ ఉండటంతో ఇప్పుడు యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు దీనికి బానిసలుగా మారుతున్నారు. 

 

గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ తీరంలో నాటుసారా తయారీ భారీగా జరుగుతుంది. కొంత మంది అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై సీరియస్ అవుతున్న నేపధ్యంలో అధికారులు దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖ భారీగా నాటు సారా తయారి మీద దృష్టి పెట్టింది. గుంటూరు జిల్లాలోని స్టువర్ట్ పురంలో తయారి కేంద్రాన్ని గుర్తించారు. అటవీ ప్రాంతంలో, జనావాసం లేని చోట దీని తయారి ఎక్కువగా జరుగుతుంది. దీనితో పేదలు దీనికి అలవాటు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండ కూడా ఉండటంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. దీనితో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: