ప్రేమికుల దినోత్సవం అనేది ఏడాదికి ఒక రోజే వస్తుంది. ఏ రోజు అయినా ఏడాదికి ఒక రోజే వస్తుంది. విదేశీ పండగ అయినా సరే మన దేశంలో జనాభాతో పాటుగా ప్రేమికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్న నేపధ్యంలో అందరూ దీన్ని జరుపుకునే పరిస్థితి ఉంది. ఎక్కడో లంగా ఓణీలు ధరించే అమ్మాయిలు మినహా అందరూ దీన్ని జరుపుకుంటున్నారు. అంటే వాళ్ళు అనే కాదు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు లెండి. మళ్ళీ ఫాంట్ షర్టు వేసుకున్న మేము చేసుకున్నామా అని ఎదురు ప్రశ్నిస్తారు. ఈ మధ్య ఈ ట్రెండ్ కూడా కాస్త ఎక్కువైంది అనే చెప్పుకోవచ్చు. 

 

ఇదిలా ఉంటే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులు ఎంత ఎంజాయ్ చేస్తారో లేదో తెలియదు గాని, బజరంగ్ దళ్ కార్యకర్తలు మాత్రం అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమికులు కనపడితే చాలు తాళి పట్టుకుని కట్టే వరకు అన్ని విధాలుగా వేధిస్తూ ఉంటారు. దీనితో ప్రేమికులు ఇప్పుడు పార్కులకు వెళ్ళాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. పార్కులకే కాదు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలి అన్నా సరే ప్రేమికుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. దీనితో ఇప్పుడు భారీగా పార్కులు, పర్యాటక ప్రదేశాల ఆదాయం పడిపోయింది అంటున్నారు. 

 

చాలా వరకు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు ప్రేమికులు వెళ్ళడానికి ఇష్టపడటం లేదట. ఎక్కడ కార్యకర్తలు వస్తారో ఎక్కడ తాళి కట్టమంటారో అంటూ భయపడిపోతున్నారు. దీనితో ప్రముఖ నగరాలు అయిన విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ పార్కులు, పర్యాటక ప్రదేశాల్లో ఆదాయం భారీగా తగ్గిపోయిందని సమాచారం. కొన్ని పార్కులకు అయితే జన సంచారం కూడా లేదు. సాధారణంగా ఆ రోజు ప్రేమికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఫ్యామిలీలు వెళ్ళవు. అయితే ఈ సారి కార్యకర్తలకు భయపడి ప్రేమికులు కూడా వెళ్లకపోవడంతో ఆదాయం భారీగా పడిపోయిందని పార్కుల్లో కాంట్రాక్టులు తీసుకునే వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: