ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లు చదువుకోనివారిని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు గూగుల్ లో నకిలీ ఫోన్ నంబర్లను అప్ లోడ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకులకు సంబంధించిన ఫిర్యాదు తాలూకు నంబర్లు, కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో మార్చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా సైబర్ నేరగాళ్లు గూగుల్ పే కస్టమర్లను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడ్డారు. కుషాయిగూడకు చెందిన మహేష్ గూగుల్ పే ఉపయోగించి 65,000 రూపాయలు కాలేజీ బ్యాంక్ అకౌంట్ కు జమ చేశాడు. కానీ కాలేజీ బ్యాంకు ఖాతాలో మాత్రం నగదు జమ కాలేదు. మహేష్ గూగుల్ పే నంబర్ కోసం గూగుల్ లో వెతికి అందులో కనిపించిన నంబర్ కు కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి మహేష్ బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్ వివరాలను తెలుసుకున్నాడు. 
 
ఆ తరువాత 65,000 రూపాయలు మేం చెప్పిన ఖాతాకు పంపితే ఆ డబ్బును కళాశాల ఖాతాలో జమ చేస్తామని మీ 65,000 రూపాయలు తిరిగి మీ ఖాతాలో జమ అయ్యేలా చేస్తామని మహేష్ కు ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి చెప్పాడు. మహేష్ అతడు చెప్పిన విధంగానే 65,000 రూపాయలు అతడు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. ఆ తరువాత మహేష్ కు కళాశాల యాజమాన్యం మొదట పంపిన 65,000 జమ అయినట్లు తెలిపింది. 
 
తన డబ్బులు తిరిగి పంపమని కోరాలని మహేష్ కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేయగా ఆ నంబర్ స్విఛాఫ్ వచ్చింది. గూగుల్ పే కస్టమర్లు గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో ఉంచదని గుర్తుంచుకోవాలి. గూగుల్ పే కస్టమర్లు ఎప్పుడైనా కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేయాలంటే గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లి హెల్ప్ & ఫీడ్ బ్యాక్ క్లిక్ చేసి చాట్ లేదా కాల్ ఆప్షన్ ను ఎంచుకొని కస్టమర్ కేర్ ను సంప్రదించి ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: