ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులను ఉద్దేశించి మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్సనల్ అసిస్టెంట్ దగ్గర రెండు వేల కోట్లు దొరికితే ఇంకా ఆయన దగ్గర ఇంకా ఎన్ని వేల కోట్లు దొరుకుతాయి..? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు అంత భయం వేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే మీడియాని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.

 

చంద్రబాబుని రక్షించడానికి ఆయన మీడియా వర్గం చాలా నీచమైన జర్నలిజం చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా ఈనాడు అధినేత రామోజీరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. వ్యక్తుల కోసం వ్యవస్థలను ఈనాడు రామోజీరావు నాశనం చేయడానికి పూనుకున్నాడని ఆయన అన్నారు.తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచురించారని, దానిపై తాను లేఖ రాస్తే దానిని కూడా సరిగా రాయలేదని ఆయన అన్నారు. చంద్రబాబు కోసం రామోజీ ఇంతగా దిగజారుతున్నారని ఆయన అన్నారు. రామోజీకి ఎనభై ఏళ్ల వయసు వచ్చిందని, ఈ వయసులో కూడా ఆయన ఇలా చేయాలా అని బొత్స ప్రశ్నించారు.

 

తాము ఎక్కడా ఎన్.డి.ఎ.తో కలిసి వెళతామని అనలేదని ఆయన స్పష్టం చేశారు.దీనికి సంబందించి విశాఖలో చేసిన వ్యాఖ్యల వీడియోను బొత్స ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీని మరియు చంద్రబాబు ని కాపాడటానికి రామోజీరావు తన పత్రికలను అడ్డంపెట్టుకుని డ్రామాలాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈనాడు రాసిన వార్తలను చూసి కొన్ని ఇంగ్లీష్ పత్రికలుకూడా రాశాయని బొత్స సత్యనారాయణ అన్నారు. మరోపక్క జాతీయ స్థాయిలో ఉన్న బిజెపి పార్టీ అగ్ర నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మీడియా రాతలను తీవ్రంగా విమర్శలు చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: