తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే సీనియర్ హీరోల ఫ్యామిలీ నుంచి చాలా మంది యువ హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు... కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏ యువ హీరో పరిచయం కాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు తప్ప ఏ కొత్త  హీరో కూడా తెరమీదికి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నందమూరి అభిమానులు అందరూ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అప్పుడు అప్పుడు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఏంట్రీ  ఎప్పుడు అనేది మాత్రం సరైన క్లారిటీ రాలేదు.  దీనిపై బాలకృష్ణ కూడా ఎప్పుడూ స్పందించలేదు. 

 

 అయితే అభిమానులకు సంతోషం కలిగించేలా  ఈమధ్య బాలకృష్ణ తన వారసుడైన మోక్షజ్ఞను  అమెరికాకు పంపి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పించారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ కు అమెరికాలో  పలు మెలుకువలు నేర్పించేందుకు అమెరికాలోని ప్రఖ్యాత లిస్ట్ స్టాస్ బర్గ్  ఫిలిం అండ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో చేర్పించినట్లు సమాచారం. ఇక  అమెరికాలో యాక్టింగ్  కోర్సు పూర్తి కాగానే మోక్షజ్ఞ ' ఇండియాకు తిరిగి వస్తాడని... ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాడు అని.. మోక్షజ్ఞ లాంచ్ గ్రాండ్ గా ఉంటుందని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో చర్చించుకుంటున్నారు. 

 

 అంతేకాదండోయ్ మరో ఇంట్రెస్టింగ్  అప్డేట్ కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ  సినిమా దర్శకత్వ బాధ్యతలను.. బాలకృష్ణ సెంటిమెంట్ దర్శకుడైన బోయపాటి శ్రీనుకి  అప్పగించారట. మోక్షజ్ఞ సినీ రంగ పరిచయానికి తగిన కథలు బోయపాటి శ్రీను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి బాలయ్య తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే త్వరలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు  వార్తలు వస్తుండటంతో నందమూరి అభిమానులు అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: