అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన అంటే మామూలుగా ఉండదు. ఆ దేశానికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్లే ట్రంపు ఏదేశానికి బయలుదేరుతారో...ఆ దేశానికి ముందే బయలుదేరి తమ అధ్యక్షుడు పర్యటించి బోయే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానిగా మోడీ 2014లో ఎన్నికైన సందర్భంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటించిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ సమయంలో గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న తరుణంలో బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది. మళ్లీ ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో..ఇటీవల మోడీ మళ్లీ ప్రధానిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవటం తో ట్రంప్ భారత పర్యటన చేయబోతున్నాడు.

 

ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ట్రంపు పర్యటన కోసం చేస్తున్న ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. విషయంలోకి వెళితే డోనాల్డ్ ట్రంప్ కు పర్యటన ఫిబ్రవరి 24వ తారీఖున గుజరాత్ లో జరగనుంది. ఈ సందర్భంగా అహ్మదాబాదులో డోనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. అయితే అహ్మదాబాదులో డోనాల్డ్ ట్రంప్ ఉండేది మూడు గంటలు మాత్రమే. అయితే మూడు గంటల కోసం విజయ్ రూపాన్ని సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్‌ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను అందించనుంది.

 

మోటేరా స్టేడియం ప్రారంభించిన తర్వాత ఎయిర్ పోర్టుకు ట్రంప్ తిరిగి వెళ్లే మార్గంలో 1.5 కిలోమీటర్ల రోడ్డు పొడవునా కొత్త రోడ్లను వేయిస్తున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. వీటి కోసం రూ. 80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ట్రంపు భద్రత కోసం రోడ్ షో వెంబడి సంస్కృతి కార్యక్రమాల కోసం భారీగానే భారత ప్రభుత్వం బందోబస్తుతో డబ్బులు కూడా ఖర్చు చేయనున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. దీంతో మొత్తం మీద డోనాల్డ్ ట్రంప్ తో మూడు రోజుల పర్యటనకు భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: