ఏపీలో రాజకీయ పోరు ఇండియా, పాకిస్దాన్ యుద్ధంలా సాగుతుంది.. ఏ రకంగా చూసుకున్న ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో అవినీతి చేపలను గాలం వేసి లాగుతున్న అధికార పార్టీ దేనికి భయపడకుండా ముందుకు వెళ్లుతుంది.. ఈ దశలో ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ మధ్య మాటల పోరు ఘాటుగా సాగుతుంది..

 

 

ఇకపోతే తాజాగా బాబుగారి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. అయితే ఈ దాడుల్లో రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయన్న వార్తలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఈ దశలో టీడీపీ నేతలు, వైసీపీ నేతలు  తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు..

 

 

ఈ నేపధ్యంలో బొండా ఉమ కూడా ఘాటుగా స్పందించారు. శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు చేయగా, రూ.2 వేల కోట్లు దొరికాయని రాష్ట్రంలో ఉన్న జఫ్ఫా బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదే కాకుండా తాడేపల్లిలో కూర్చుని పొద్దునొక జఫా, మధ్యాహ్నం ఒక జఫా, సాయంత్రం ఒక జఫా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని సంచలన వాఖ్యలు చేసారు..

 

 

శ్రీనివాస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికితే చంద్రబాబు వద్ద లక్షల కోట్లు దొరుకుతాయని, అసత్య ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి అబద్దపు ప్రచారాలు చేయడంలో వారికి వారే సాటి అని వైసీపీ నేతల పై ధ్వజమెత్తాడు బొండా ఉమ..

 

 

ఇకపోతే ఒక వైపు అమరావతి వివాదం, మరో వైపు అవీనితి అంతం, ఇంకోవైపు కేంద్రం నుండి రాని నిధులు, ఇలా ఏపీలో ఎన్నో సమస్యలు, ఇలాంటి పరిస్దితిలో జగన్ సర్కార్‌కు పాలన కత్తిమీద సాములా మారిందనుకుంటున్నారట కొందరు నాయకులు.. ఇకపోతే ప్రస్తుతం నెలకొంటున్న రాజకీయ పరిస్దితులు ఎటువైపు దారితీస్తాయో తెలియక, అసలు క్లారీటి రాక ఏపీ ప్రజలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: