త‌న‌ను తాను మార్చుకోవ‌డ‌మే గొప్ప విష‌యం అయితే.. ప్ర‌పంచ గ‌మ‌నాన్ని మార్చ‌డం ఎంత గొప్ప‌! ఇలాం టి దానినే సాకారం చేసి నిరూపిస్తున్నారు యువ టెకీ.. కోటిరెడ్డి స‌రిప‌ల్లి. టెక్నాల‌జీ దిగ్గ‌జంగా ఆయ‌న ప్ర‌పం చ వ్యాప్త గుర్తింపు పొందారు. అధునాతన సాంకేతిక యుగంలో టెక్నాలజీ అంద‌రినీ శాసిస్తున్న తీరు తెలి సిందే.  అయితే, టెక్నాల‌జీనే శాసిస్తున్న యువ కిశోరం కోటిరెడ్డి. కృషితో నాస్తి.. అన్న‌ట్టుగా పేద కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగి.. సొంత‌గా ఓవ్య‌వ‌స్త‌ను ఏర్పాటు చేసుకున్నారు. జ్ఞాన భూమి వంటి కీల‌క‌మైన పోర్ట‌ల్‌ను రూప‌క‌ల్ప‌న చేయ‌డంతోపాటు వ్య‌క్తుల ఆరోగ్యాన్ని మదింపుచేసే స్థాయిలో కీల‌క‌మైన పోర్ట‌ళ్ల‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు.

Image result for kotiigroupofventures

 

అదేస‌మ‌యంలో ఆన్‌లైన్‌లో సెక‌న్ల తేడాలో నగ‌దు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకోవ‌డం నుంచి అనేక అంశాల‌పై చేసి న ఆవిష్క‌ర‌ణ‌లు నేడు ప్ర‌పంచ‌స్థాయిలో మెప్పు పొందుతున్నాయి. ఆధునికంగా వ‌స్తున్న మార్పుల‌ను ప్ర జ‌ల‌కు చేరువ చేయ‌డంతోపాటు సాంకేతిక యుగంతో ఎంత ప్ర‌యోజ‌నం ఉందో.. అంతే స్థాయిలో నెల‌కొన్న విష‌మ తుల్య ప‌రిస్థితుల‌ను కూడా ఆయ‌న హెచ్చ‌రిస్తారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో ఏం చేయాలి.. ఏం చేయ‌కూడ‌దో కూడా వివ‌రించి సాంకేతికాంశాల విష‌యంలో ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు దిశానిర్దేశం చేస్తారు. మొత్తంగ చూస్తే.. సాంకేతికంగా చూస్తే.. తాను రూపొందించిన అంశాల‌పైనే కాకుండా రాబోయే త‌రాల‌కు పొంచి ఉన్న ముప్పుపై కూడా కోటిరెడ్డి చేస్తున్న హెచ్చ‌రిక‌లు ముదావ‌హం!

Image result for kotiigroupofventures

టెక్నాల‌జీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న కోటిరెడ్డి.. తాను ఎద‌గ‌డ‌మే కాకుండా త‌న నీడ‌లో మ‌రింత మందికి ఉపాధి క‌ల్పిస్తున్నారు. ఒక్క‌డిగా మొద‌లైన ప్ర‌స్థానం నేడు ఎంతో మందికి దారి చూపించ‌డంతోపాటు.. మ‌రింత మందికి స్ఫూర్తిగా మారి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంతో మంది స్టార్ట‌ప్ ల‌కు ఆయ‌న మార్గ‌ద‌ర్శిగా ఉన్నారు. సేవా భావం పుణికి పుచ్చుకుని న‌భూతో అన్న‌విధంగా ముందుకు సాగుతున్నారు. సామాజిక దృక్ఫ‌థం, ఆర్థిక క్ర‌మ‌విక్ష‌ణ‌, స్ఫూర్తి మంత‌మైన జీవ‌నం వంటివి నేటి యువ‌త‌కు, రాబోయే త‌రాల‌కు కూడా ఎంతో స్ఫూర్తి దాయ‌కం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: