ఆంధ్రప్రదేశ్ లో నాలుగు నెలల క్రితం సంచలనం సృష్టించిన వ్యవహారాల్లో గన్నవర౦ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారం కూడా ఒకటి. ఈ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీ తీవ్రంగానే ఇబ్బంది పడింది. పార్టీలో మాస్ నాయకులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉన్న వల్లభనేని వంశీ కూడా పార్టీకి రాజీనామా చేయడంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఆయనతో ఎన్నో సంప్రదింపులు జరిపి, కేసినేని నానీ, కొనకళ్ళ నారాయణ వంటి వారితో సంప్రదింపులు జరిపినా సరే ఆయన మాత్రం పార్టీలో ఉండటానికి ఇష్ట పడలేదని తెలిసింది. 

 

అయితే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవితో పాటుగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుని వెళ్ళిపోయే అవకాశం ఉందని టాక్ వినపడింది. కాని ఆ తర్వాత ఆయన శాసన సభలో ఒక్కరే కూర్చోవడంతో ఆ అనుమానాలకు తెరపడింది. జగన్ నుంచి ఆయనకు సహకారం ఉందని అందుకే రాజకీయాల నుంచి తప్పుకోకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వంశీ ఆగారని టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తుంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి రాజీనామా చేస్తారని అంటున్నారు. 

 

అదే సమయంలో నియోజకవర్గంలో ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉందని, అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఇదే విషయాన్ని మంత్రి కొడాలి నానీ దృష్టికి కూడా వంశీ తీసుకు వెళ్ళారని అంటున్నారు. నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు హవా ఎక్కువగా ఉందని కాబట్టి తనకు విలువ లేదని ఉన్నా సరే తన వర్గానికి ఏ పనీ చేయలేకపోతున్నా అని అయన నానీ ముందు వాపోయినట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల లోపు ఆయన తప్పుకోవడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: