ప్రమాదవశాత్తు ఒక లేగదూడ చావుకు కారణమయ్యాడు ఓ వ్యక్తి. అయితే దీనికిగాను గ్రామ పెద్దలు ఏం చేస్తారు... జరిమానా విధిస్తారు లేకపోతే ఇంకా ఏదైనా శిక్ష విధిస్తారు. ఇక్కడ గ్రామ పెద్దలు కూడా లేగదూడ చావుకు కారణమైన వ్యక్తికి శిక్ష విధించారు కానీ ఆ శిక్ష మామూలుది కాదు చాలా విచిత్రమైనది. లేగదూడ చావుకు కారణమైన వ్యక్తి తన సొంత బిడ్డని పెళ్లి చేసుకోవాలంటూ ఆ గ్రామ పంచాయతీ పెద్దలు ఆదేశించారు. లేగదూడ ప్రాణం పోవటానికి  కారణమైన వ్యక్తికి  ప్రాయశ్చిత్తంగా వెంటనే సొంత కూతురిని  వివాహం చేసుకుంటే పరిహారం అవుతుంది అంటూ సెలవిచ్చారు. దీంతో ఆ వ్యక్తి షాకవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్లోని విదిశా  జిల్లా పథేరియాలో ఓ వ్యక్తి బైక్ పై  వెళ్తున్న సమయంలో ఆవు దూడ అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ మరణించింది.  కాగా ఈ ఘటనపై ఊరి పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేసి దూడ  చనిపోవడానికి కారణమైన వ్యక్తి పరిహారం చెల్లించాలి అంటూ నిర్ణయించారు. కాగా ఆ వ్యక్తి  గంగానదిలో స్నానం చేసి వచ్చి ఊర్లో వారందరికీ అన్నదానానికి సిద్ధమయ్యాడు. కానీ ఊరి పెద్దలు మాత్రం తన సొంత మైనారిటీ కూతురిని  పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు.దీనికి  సంబంధించి పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఈ విషయమై కొంత మంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ కు పెళ్లి చేయడం చట్ట విరుద్ధం అంటూ చెప్పిన పంచాయతీ పెద్దలు మాత్రం వినిపించుకోలేదు. దీంతో గట్టిగానే పోలీసులు వాళ్ళ స్టైల్ లో వార్ణింగ్ ఇచ్చారు. 

 

 అయితే ఊరి పెద్దలను  హెచ్చరించారు కానీ ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు.ఇక  ఆధార్ కార్డు లో ఆ మైనర్ బాలిక వయస్సు 14 సంవత్సరాలు గా ఉంది.అయితే దీనిపై మాట్లాడిన స్థానిక సీఐ.. స్థానికంగా  కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ఆవు దూడ చంపితే పరిహారం తప్పనిసరి అని భావిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల అవును కానీ దూడను కానీ చంపితే బిడ్డని పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్పు ఇస్తారని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: