ఫిబ్రవరి 17వ తేదీన చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖుల జనాలు జరిగాయి . మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 

 

 కల్వకుంట్ల చంద్రశేఖర రావు జననం : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన జన్మించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానీకి ముందుండి నడిపించి  ఎన్నో ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పోరాడి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఎమ్మెల్యేగా పదవులను అలంకరించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.  ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 

 

 

 ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు... తనదైన పాలనతో తెలంగాణ ప్రజలందరికీ సుపరిపాలన అందించారు. ఇక 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  రెండోసారి ఘన విజయం సాధించి డిసెంబర్ 13న రాజ్ భవన్ లో  తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీడీపీ పార్టీకి రాజీనామా చేసి... తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రస్తుతం గులాబీ దళపతిగా  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా... తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ కేసీఆర్  ముందుకు సాగుతున్నారు. 

 

 

 సదా జననం : ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్లలో ఒకరు సదా. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన సదా... ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. కాగా సదా 1984 ఫిబ్రవరి 17వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించాడు. తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు హీరోయిన్ సదా. ఇక తెలుగు చిత్ర ప్రేక్షకుల మనసులో నిలిచి పోయేల  ఎన్నో సినిమాల్లో నటించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: