ఈ వారం అంత మీడియా కొన్ని విషయాలను బాగా బలంగా ఫోకస్ చేసింది.. ఇటు ఆంధ్రలో అటు తెలంగాణాలో కొన్ని విషయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఈ వారం మొత్తం సినిమా.. రాజకీయాల అంశాలు తిస్తె.. 

 

సినిమా పరంగా.. రేణు దేశాయ్ వార్త సంచలనం అయ్యింది. రేణు దేశాయ్ ఇల్లు పవన్ కళ్యాణ్ కొనిచ్చాడు అని ఫ్యాన్స్ అంటే.. రెండు దేశాయ్ అందుకు స్పందించి.. ఈ ఇల్లు నా కష్టజీతం అని ఆమె చెప్పింది. దీంతో ఈ వారం అంత ఆమె వార్త సంచలనం అయ్యింది. 

 

ఆంధ్ర రాజకీయాల్లో.. తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రముఖ నేతలకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబుకు భద్రతను తొలగించారు. స్టేట్ సెక్యురిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు భద్రత తొలిగించామని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో చాలా జరిగాయి. 

 

ఇంకా తెలంగాణ రాజకీయాల్లో.. తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఐదుగురిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం (ఫిబ్రవరి 10) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్‌ రెడ్డి, గుగులోతు శంకర్‌ నాయక్‌, సయ్యద్‌ ఖలీలుల్లా, ఎం నారాయణ రెడ్డి, మహ్మద్‌ అమీర్‌‌ను ఈ పదవుల్లో నియమించింది. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాం, సభ్యుడిగా బుద్ధా మురళి కొనసాగుతుండగా.. తాజాగా ఐదుగురు సమాచార కమిషనర్లను కేసీఆర్ సర్కార్ నియమించింది.

 

తెలంగాణలో వరంగల్ మహానగరంలో మెట్రో రైలు ఏర్పాటు కోసం మహారాష్ట్రకు చెందిన మహా మెట్రో సంస్థ ప్రతినిధులు బుధవారం వరంగల్‌ నగరానికి వచ్చి పరిశీలించారు. దీంతో వరంగల్‌ మహా నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు కీలక అడుగు పడింది. తెలంగాణ ఎంసెట్‌ తేదీలు ఖరారయ్యాయి. మే 4, 5, 6వ తేదీల్లో ఇంజినీరింగ్‌; మే 9, 11వ తేదీల్లో అగ్రికల్చర్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: