ఈ వారం వైసీపీ పార్టీలో జగన్ ఢిల్లీ పర్యటనల గురించి ఎక్కువగా చర్చ జరిగింది. వైసీపీ పార్టీ ఎన్డీఏలో చేరబోతుందని విపరీతంగా ప్రచారం జరగడంతో బొత్స ఈ ప్రచారం గురించి స్పందించారు. కేంద్రంలో చేరే అవకాశం వస్తే పరిశీలిస్తామని బొత్స చెప్పారు. వైసీపీ పార్టీ మంత్రి తానేటి వనిత సంతకాన్ని కడప జిల్లాకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఫోర్జరీ చేయడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

వైసీపీ మంత్రి అంజాద్ భాషా ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని వైసీపీ ఎన్డీయేలో చేరనుందని వస్తున్న వార్తల నేపథ్యంలో స్పందించారు. తనకు నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని పదవులు ముఖ్యం కాదని అంజాద్ భాషా చెప్పారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎం జగన్ ను ఒప్పిస్తానని చెప్పారు. వైసీపీ ఎన్డీఏలో చేరే ప్రసక్తి లేదని స్పష్టనిచ్చారు.

 

ఏపీ సీఎం జగన్ రెండు రోజుల వ్యవధిలో మోదీ, అమిత్ షాను కలవడంతో ఈ వారం వైసీపీ గురించి, వైసీపీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్వతీపురం ఎమ్మెల్యే ఫిబ్రవరి 13వ తేదీన టీచర్ గా మారిపోయి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు గణితం, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు.

 

మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బీజేపీ పార్టీల పొత్తు విషయంలో తుది నిర్ణయం జగన్ దే అని అన్నారు. హోదా విషయంలో విపక్షాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని చెప్పారు. వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా.? లేదా...? అనే ప్రశ్నలకు మాత్రం వైసీపీలో నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: