రాజకీయాల్లో 'సినిమా' కష్టాలుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పార్టీ పెట్టమన్న ఆనందం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిని అనే సంతోషం పవన్ లో కనిపించడంలేదు. ఏదో పార్టీ పెట్టాము కాబట్టి ... రాజకీయంగా పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నాం తప్ప సీరియస్ గా రాజకీయాలవైపు పవన్ దృష్టిపెట్టలేక సతమతం అయిపోతున్నారు. మొన్నటివరకు టీడీపీతో సన్నిహితంగా మెలగడంతో జనసేన పార్టీ టీడీపీ అనుబంధ పార్టీగా గుర్తింపు పొంది తీవ్రంగా నష్టపోయింది. దీనిని నుంచి బయటపడేందుకు, ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ కాలేదు. 


ఇప్పుడు బీజీపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నా ... బీజేపీ మాత్రం జనసేనకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకుండా .. అసలు జనసేన పార్టీకి కానీ పవన్ కి కానీ ఇవ్వాల్సిన అంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం కూడా పవన్ కు ఎక్కడలేని బాధను కలిగిస్తున్నాయి. తన బలాన్ని, పాపులారిటీని బీజేపీ తక్కువ అంచనా వేస్తుందని, తనకు ఉన్న సినీ అభిమానులను, సామజిక వర్గ బలాన్ని కూడా బీజేపీ గుర్తించకుండా తనను చిన్న చూపు చూస్తోందని పవన్ తనలో తాను బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. 


అలా అని తన బాధను బయటకి వెళ్లగక్కలేక, దాచుకోలేక పవన్ ఇబ్బందిపడుతున్నాడు. అందుకే బీజేపీతో తెగతెంపులు చేసుకుని సొంతగానే తన సత్తా ఏంటో చూపించాలని పవన్ భావిస్తున్నాడు. దేనిలో భాగంగానే ఎన్డీయేలో కనుక వైసీపీ చేరితే తాను బీజేపీతో పొత్తు రద్దు చేసుకుంటాను అంటూ పవన్ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడు. వైసీపీ బీజేపీ కలిసి ఆడుతున్న మైండ్ గేమ్ కూడా పవన్ కు ఒక పట్టాన అర్ధం కావడంలేదు. పొత్తు పేరుతో తనను రాజకీయంగా అణగదొక్కేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంది అనే అనుమానం కూడా పవన్ లో కనిపిస్తోంది. ఈ అన్నీ వ్యవహారాలతో విసిగెత్తిపోయిన పవన్ అసలు రాజకీయాలేంటి ..? నాకు ఈ బాధలేంటి అంటూ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: