తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా రాణించారు. ప్రజల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుని కీర్తించబడుతున్నాడు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సరికొత్త రికార్డును అప్పట్లో ఎన్టీఆర్ సాధించాడు. అప్పటికీ, ఇప్పటికీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు గాని, తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేని అంతగా వారి గుండెల్లోకి చొచ్చుకెళ్లిపోయాయి.అంతగా ఎన్టీఆర్ పేరు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. 


ఇక ఎన్టీఆర్ వలె రాజకీయాలు చేయాలని, ఆయనలా వ్యవహరించాలని అనుకునేవారికి కొదవే లేదు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన క్రేజీవాల్ కూడా అదే విధంగా ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్నట్లు గా కనిపిస్తోంది. క్రేజీవాల్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఎన్టీఆర్ కు దగ్గరగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ స్థాపించి ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ఆయన బాగా సక్సెస్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలు, నిర్ణయాలు  ఇవన్నీ క్రేజీ వాల్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారు అంటే ఎన్టీఆర్ అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగానే క్రేజివాల్ కూడా ఢిల్లీలో పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 


అందుకే తరచుగా తాను ఢిల్లీ పుత్రుడుని అని చెబుతూ వస్తున్నాడు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ ...ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అతి సామాన్య ప్రజలను ఆహ్వానించాడు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని తాను నడపడం లేదని, ప్రజలే నడుపుతున్నారని, తాను వారిలో ఒక్కడిని అంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే అన్న ఎన్టీఆర్ ను క్రేజీవాల్ ఫాలో అయిపోతున్నాడనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: