కేంద్రం తీసుకువచ్చిన  ఎన్ ఆర్సీ , సీ ఏఏ చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ అధికార , ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు గళాన్ని వినిపిస్తున్నారు . ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరుతానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా , దానికి సీఎం ను ఒప్పిస్తానని చెప్పుకొచ్చారు . ఎన్ ఆర్సీ పై కేంద్రం ముందుకు వెళితే తాను తాను తన పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్న విషయం తెల్సిందే .

 

కడప లో ఎన్ ఆర్సీ , సీ ఏఏ వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలో అంజాద్ బాషా ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు . అసెంబ్లీ లో  సీ ఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని , దానికి టీడీపీ నాయకత్వం మద్దతు ఇవ్వకపోతే, తాను ఆ  పార్టీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు . అయితే కడప కు వెళ్లి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా కేశినేని నాని , అంజాద్ బాషా ను ఇరకాటం లోకి నెట్టే ప్రయత్నం చేసినట్లుగా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . దానికితోడు ఎన్ ఆర్సీ , సీ ఏఏ పై అవగాహన లేకనే తాము పార్లమెంట్ లో ఆ బిల్లుకు మద్దతునిచ్చామని అంజాద్ బాషా పేర్కొనడం పై కూడా నాని కౌంటర్ వేశారు . అవగాహన లేనివారికి పదవులు ఎవరు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు .

 

అంజాద్ బాషా ను ఇరకాటం లోకి నెట్టే క్రమం లో కేశినేని నాని సొంత పార్టీ క్యాడర్ ను కూడా అయోమయం లోకి నెట్టారని అంటున్నారు . సీ ఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం వేరని , అదే సమయం లో టీడీపీ మద్దతునివ్వకపోతే తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తానని  పేర్కొనడం ద్వారా వ్యక్తిగత మైలేజి సాధించేందుకే నాని ఆరాటపడుతున్నట్లుగా కన్పిస్తోందని విశ్లేషిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: