2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి విప్లవాత్మకమైన సంచలన పరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ప్రత్యర్థులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. caa మరియు nrc ఇలాంటి నిర్ణయాలు తీసుకుని దేశవ్యాప్తంగా వ్యతిరేకత మూట కట్టుకున్న బిజెపి తాజాగా 2000 నోట్లు గురించి రద్దు చేస్తున్నట్లు వార్తలు ఇటీవల రావడం జరిగాయి. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో గెలిచిన సమయంలో విదేశాలలో దేశానికి చెందిన నల్లధనాన్ని తీసుకు వచ్చి వంద రోజుల్లో పేద వాళ్ళందరికీ పంచుతానని మోడీ మాట ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో ఎన్నికల్లో గెలిచిన మోడీ ప్రధాని అయ్యాక ఆ హామీని గాలికొదిలేశారు.

 

అయితే ఆ సమయంలో మోడీ పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్న తరుణంలో...అనుకోకుండా ఒక్కసారిగా ఆ టైంలో దేశంలో చలామణి అవుతున్న 500 మరియు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడం జరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో ఉన్న ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఎక్కువగా పేద మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా సమయంలో మోడీ సర్కార్ పై వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినా మోడీ ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది.

 

దీంతో ఇటువంటి సమయములో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ అవుతుంది. అదేమిటంటే త్వరలోనే రాబోయే రోజుల్లో దేశంలో రూ. 2000 నోటును రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.  దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రెండువేల నోటు రద్దు చేస్తారని వస్తున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలో రెండు వేల నోటు కనిపించకపోతుండటంతో ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని ప్రజలు భయపడుతున్నారని, అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: