నిన్న ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సమావేశంలో తెలంగాణ కేబినేట్ కొన్ని కీలక అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. అయితే ఆ కీలక నిర్ణయాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

ఈ నెల 18న ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు. అయితే ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, మేయర్లు, కలెక్టర్లను ఆహ్వానించారు.. పురపాలక సదస్సులో పట్టణప్రగతి విధివిధానాలు ఖరారు చేశారు. అదే రోజు గజ్వేల్‌లో మార్కెట్, స్మశానవాటికను బృందం సందర్శించనుంది. 

 

ఇక ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం.. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి, ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారి.. జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్ల నిధులు కేటాయించనున్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

 

అలాగే లోకాయుక్త చట్టసవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక అలాగే మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు సీఎం కేసీఆర్ అధికారులను అభినందించారు. అలాగే అభయ హస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. 

 

భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కేబినెట్ కోరింది. ఇక చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని వినతి. లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఉన్న సిటిజెన్‌షిప్ యాక్టును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కేబినెట్ కోరింది. ఇక పోతే నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.. ఈరోజుని తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: