ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజధాని వ్యవహారం అధికార వైసీపీ ని కాస్త ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఏకపక్షంగా ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు అంటూ అధికార పార్టీపై విపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని మార్పు అనేది ఇప్పుడు అత్యవసరం కాకపోయినా జగన్ ఎందుకు ముందుకు వెళ్తున్నారు అంటూ పలువురు మండిపడుతున్నారు. ఆయనకు అంత అవసరం ఏమి వచ్చింది అంటున్నారు. ఇక రాజధాని వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు పోరాటం ఎక్కువే చేస్తున్నారు. 

 

అది పక్కన పెట్టి నాయకుల విషయానికి వస్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ నేతలకు రాజధాని వ్యవహారం అనేది ఇప్పుడు చాలా వరకు చికాకుగా మారింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాజధాని మార్చవద్దు అని వాళ్ళు ఎంత కోరుతున్నా వాళ్ళ మాట వినే నాథుడే కరువు అయ్యాడు. అందరి గురించి పక్కన పెట్టి యువనేత దేవినేని అవినాష్ విషయానికి వస్తే, ఆయన ఎన్నో ఆశలతో వైసీపీలోకి అడుగుపెట్టారు. పెట్టిన కొన్ని రోజులకు రాజధాని వ్యవహారం బయటకు వచ్చింది. దీనితో అవినాష్ ఎక్కడికి వెళ్ళినా జనాల రాక అనేది తగ్గింది. 

 

సోషల్ మీడియాలో కూడా ఆయన క్రేజ్ తగ్గిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి భవిష్యత్తు కష్టమే అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. ఇవి అవినాష్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తే ఇప్పుడు ఇలా అయింది. దీనితో అవినాష్ ఎటూ వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న అవినాష్ కి రాజధాని వ్యవహారం తలనొప్పి గా మారింది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని మార్పుపై తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి దీని నుంచి వైసీపీ బయటపడితేనే అవినాష్ సేఫ్ గా ఉంటారని పరిశీలకులు కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: