మనుషుల మధ్య ఐకమత్యం నశించింది. దీనితో పాటుగా మానవత్వం మచ్చుకైనా కనబటడం లేదు.. ప్రతి సమస్యకు ప్రాణాలే సమాధానంగా బ్రతుకుతున్నారు.. విచక్షణ కోల్పోయి, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.. ఒక మంచిపని కోసం వేయని అడుగులు, ఒకన్ని నాశనం చేయాలంటే మాత్రం ముందుంటాయి.. అసలు అక్కడ జరిగింది తప్పా, కాదా అనేది ఆలోచించకుండా ఆవేశపడతాడు.. తానే హీరోలా ప్రవర్తిస్తాడు. ఇలా అక్కడి ప్రజలు చేసిన అతివల్ల ఒక నిండు ప్రాణం బలి అయ్యింది..

 

 

తమిళనాడులోని విలుప్పురంలో జరిగి ఈ దారుణం ఘటనలో ఓ మహిళకు కలిగిన అనుమానం ఒక దళితుడి నిండు ప్రాణం పోయేలా చేసింది..  ఆ వివరాలు తెలుసుకుంటే.. విలుప్పురంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న, శక్తివేల్‌ అనే దళితుడు రోజులాగే డ్యూటీకి వెళ్తూ ఊరి బయట మూత్రవిసర్జన కోసం ఆగాడట.. కాస్త అటూ, ఇటూ చూసుకుంటే బాగుండేది. కాని ఇదేమి పట్టించుకోని ఆ యువకుడు కాస్త పక్కకు వెళ్లి తన పనికానిచ్చుకుందాం అనుకునుని, ఓ పొదవైపు వెళ్లాడట. అయితే అప్పటికే అక్కడ బహిర్భూమికి వచ్చిన మహిళ ఉంది...

 

 

ఈ విషయం గ్రహించని ఆ యువకుడు అలాగే ముందుకు వెళుతుండగా, ఆ మహిళ ఏదో ఊహించుకుని, అతను తనను ఏం చేస్తాడో అని అనుమానపడి, గట్టిగా కేకలు వేసిందట. ఆ అరుపులు విని భయపడ్డ శక్తివేల్ అక్కడి నుంచి పరుగుతీశాడు. అయితే అప్పటికే మహిళ కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఆమె భర్త, బంధువులు శక్తివేల్‌ను వెంబడించి పట్టుకుని, అతని కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా హింసించడం మొదలు పెట్టారట..

 

 

ఇంతలో ఆనోటా ఈ నోటా విషయం తెలుసుకున్న శక్తివేల్‌ సోదరి ఘటన స్దలానికి వచ్చేసరికి.. అప్పటికే వారి దెబ్బలకు తాళలేక ఆ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడట.. వెంటనే హస్పిటల్‌కు తరలించే లోపే అతడు మృతి చెందాడు. ఇక మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు మహిళలు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. కాగా, అనుమానంతో మనిషి ప్రాణం తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది...

మరింత సమాచారం తెలుసుకోండి: