ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎన్నో అనుమానాలను ఇప్పుడు వ్యక్తం చేస్తుంది. అసలు ముఖ్యమంత్రి జగన్ ని ఎవరూ పిలవకుండా వెళ్ళారు అనేది టీడీపీ నేతల మాట. మీడియా సమావేశాల్లో కూడా టీడీపీ నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏదీ లేకపోతే, ఆయన ఎందుకు వెళ్ళారో మీడియాలో వార్తలే గాని అసలు ఎందుకు జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను దీనికి వెళ్లాను, దానికి వెళ్లాను, వాళ్ళను కలిసాను, వీళ్ళను కలిసాను అని ఎందుకు చెప్పడం లేదని టీడీపీ ప్రశ్నిస్తుంది. 

 

ఇదే సమయంలో మరో అనుమానం వ్యక్తం చేస్తుంది. అసలు జగన్ వెళ్ళింది రాష్ట్రం కోసమేనా...? లేక సెర్బియాలో ఉన్న తన వ్యాపార భాగస్వామి నిమ్మగడ్డ ప్రసాద్ కోసమా...? లేదు ఆయన ఈయన పేరు చెప్పాడు కాబట్టే జగన్ కంగారు కంగారు వెళ్ళారని, అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తుంది టీడీపీ. సోషల్ మీడియాలో పేరు ప్రస్తావించకుండా జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు, పరోక్ష ప్రచారం చేయడానికి సిద్దమైంది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ ప్రశ్నలు ఏంటీ...? 

 

సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ నోరు విప్పారా...? 

 

రస్‌ అల్‌ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ తన స్కాంలో ఎవరు అంతిమంగా లబ్ది పొందిన వ్యక్తి పేరు చెప్పారా...?

 

 

ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తి పేరు చెప్పారా...? 

 

సదరు నేతను విచారించడానికి రస్ అల్ ఖైమా భారత్‌ను కోరిందా...? 

 

దీనితోనే ఆ ప్రముఖ నేతలో ఆందోళన మొదలైందా...? 

 

తనను రక్షించే విధంగా లేదా తనను విచారించకుండా ఉండేందుకు సదరు నేత వ్యూహాత్మక అడుగులు వేసారా...? 

 

అందరూ ఇప్పుడు మర్చిపోయిన నిమ్మగడ్డ ప్రసాద్ గురించి ఇప్పుడు చర్చలు జరగడం ఆ చర్చల వెనుక ఒక ప్రముఖ నేత ఢిల్లీ పర్యటన ఉండటం ఇదే అనుమానాలకు తావిస్తుంది అంటూ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. 

 

చిన్న లీకు దొరికితే జగన్ పై అన్ని రకాల ప్రచారాలు చేసే టీడీపీ సోషల్ మీడియా ఈ ప్రచారం విషయంలో అదే స్థాయిలో వ్యవహరిస్తుంది. నిజమో అబద్దమో తెలియకుండా టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ఈ ప్రచారంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: