టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ... తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్ డమ్  సంపాదించి... తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక తన నటన ఆటిట్యూడ్ మాటలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్  సృష్టించి యూత్  అందరిని తనవైపు ఆకర్షించారు. తనదైన ఆటిట్యూడ్తో యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా హిట్టు కొట్ట లేకపోతున్నాడు. టాలీవుడ్ విజయ్ దేవరకొండ మేనియా తగ్గిపోతున్నట్లు  తెలుస్తోంది. Ee మధ్య  అభిమానులు కూడా విజయ్ సినిమాలపై  అంతగా ఆసక్తి చూపడం లేదు. గత కొన్ని రోజులుగా విజయ్ తీసిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడి పోతున్నాయి. 

 

 

 ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ తో కూడా రెండు సార్లు సినిమాలు చేసింది లేదు. ఎప్పుడూ కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో తన కెరీర్లో మంచి విజయాలను అందించిన దర్శకులను విజయ్ లైట్ తీసుకున్నాడు అనే కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి చూపులు సినిమా తో విజయ్ ని హీరోగా పరిచయం చేసి మంచి విజయాన్ని అందించిన తరుణ్ భాస్కర్ ను రుణం తీర్చుకునేందుకు హీరోగా పరిచయం చేసినప్పటికీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరేదైనా సినిమా చేస్తారా అంటే ఎక్కడా ఊసే  వినిపించడం లేదు. ఇక అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ ని అందించి విజయ్ దేవరకొండ కి స్టార్ హీరో రేంజ్  తీసుకువచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 

 

 

 కాగా తనకు అంత మంచి విజయాన్ని అందించిన సందీప్ రెడ్డి వంగా తో కనీసం అర్జున్ రెడ్డి సీక్వెల్ కానీ లేదా వేరే సినిమా కానీ ఇప్పటివరకు చేస్తాడు అన్న ప్రస్తావన కూడా ఎక్కడా రాలేదు. ఇక తర్వాత గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ ని అందించి విజయ్ ని వందకోట్ల హీరో గా మార్చిన దర్శకుడు పరశురాం. అలాంటి దర్శకుడితో ను ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాలో  ఛాన్స్ ఇచ్చి తన కెరియర్ కు పునాదులు వేసి ఆ తర్వాత మహానటి లో మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక  నాగ్ అశ్విన్ తో కూడా మరోసారి ఏ సినిమా రిపీట్ కాలేదు. కాగా ప్రస్తుతం పూరి  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్  సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత అయినా... తన కెరీర్లోని కీలక దర్శకులకు విజయ్ దేవరకొండ అవకాశం ఇస్తాడా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: