ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, ప్రజా సంక్షేమంపైనే ఎక్కువగా  దృష్టి పెట్టారు. ఏపీ ప్రజలకి అవసరమైన వసతులు కల్పిస్తూ ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15 న ఇంటింటికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. నేరుగా గ్రామా వాలంటీర్లు ఈ కార్డులని లబ్ది దారులకి అందచేయనున్నారు. అయితే తాజాగా కొత్త ఫెన్షన్ కార్డులని కూడా ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు...

 

 

ఈ కొత్త ఫెన్షన్ కార్డులని కూడా ఈరోజు నుంచీ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏపీలో ఫెన్షన్ పొందే అర్హతలు ఉన్న వారందరికి కొత్తగా ఇవ్వదలిచిన వైఎస్సార్ ఫెన్షన్ కానుక కార్డులని వాలంటీర్ల ద్వారా అందించనున్నారు. ఫెన్షన్ పొందే వారిలో మొత్తం అన్ని రకాల లబ్ది దారులని కలిపితే 54,68,322 మంది ఉన్నారు. వీరందరికీ డబ్బులు చెల్లించడానికి ఇప్పటికే నిధులని విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 20 తేదీ మొదలు వరుసగా 4 రోజులు ఈ కార్డులు పంపిణీ చేస్తారు.

 

ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో కొత్తగా పెన్షన్ లకు అర్హులైన వారికి పెన్షన్ బుక్కు తో పాటు, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. గతంలో పెన్షన్ పొందుతున్న వారికి ఇంతకుముందే ఇచ్చారు కాబట్టి వాళ్లకు కొత్త పెన్షన్ కార్డులు మాత్రమే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ కార్డులు తీసుకున్నవారు వాటిలో తమ పేరు, ఎలాంటి పధకానికి అర్హులుగా  పొందుతున్నారు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్  వంటి వివరాలు రాసి ఉంచుకోవాలి.

 

ఒకవేళ పెన్షన్ రాకపోయినట్లయితే ఈ కొత్త కార్డు ఆధారంగా పెన్షన్ డబ్బులు అడగమని తెలిపారు అధికారులు. అందుకే ఈ కొత్త కార్డులు జాగ్రత్తగా దాచుకోవాలని అదనంగా జిరాక్స్ కాపీ తీయించుకుని ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అంతా కచ్చితంగా కొత్త పెన్షన్ కార్డులను పొందాలని, దీనిపైన ఏదైనా అనుమానం కలిగితే గ్రామ వాలంటీర్ లను కానీ లేదంటే గ్రామ సచివాలయం కానీ సంప్రదించవచ్చని తెలిపారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: