మామూలుగా చాలా మందికి కొన్ని కొన్ని విషయాల్లో ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అనిపిస్తుంది. అయితే మామూలు సామాన్యులకు  అయితే ఓకే కానీ సంపన్నుల్లో ఒకరైతే.. ఇక ఆ ఖర్చు భారీగా ఉంటుంది. ఇక్కడ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ఇదే చేస్తున్నాడు. గత కొంతకాలంగా గర్ల్ ఫ్రెండ్ తో  జల్సాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నాడు. కాగా ఇతడు పెడుతున్న ఖర్చు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ లో కొనసాగుతున్న ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్... 2019లో భార్య మెకంజీ బెజోస్ తో విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్నారు. 

 

 

 

 ప్రస్తుతం జెఫ్ బెజోస్ గర్ల్ ఫ్రెండ్ లౌరెస్ సాంచెజ్ తో  విలాసాలను అనుభవిస్తూ ఎంతగానో ఖర్చు  చేస్తున్నాడు. ఇటీవలే అమెజాన్ లోని నాలుగు వందల కోట్ల డాలర్ల విలువైన షేర్లను నగదుగా మార్చుకున్న జెఫ్ బెజోస్.. పెద్ద మొత్తంలోనే విలాసాల కోసం ఖర్చు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంపన్నుడు చేస్తున్న ఖర్చు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకు.. భారీగా కొనుగోలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ముచ్చట తీర్చు కోవడానికి ఏకంగా 1150 కోట్లు ఖర్చు పెట్టడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. బెవర్లీ హిల్స్ లో అత్యంత విలాసవంతమైన భవనాన్ని 165 బిలియన్ డాలర్లు అంటే 1150 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు ఈ ప్రపంచ సంపన్నుడు. 

 

 

 

 లాస్ ఏంజల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక భవనానికి ఇంత మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయడం ఇప్పటివరకు చూడలేదని వాణిజ్య విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. జార్జియన్ శైలిలో విస్తారమైన టెర్రస్ తో  పాటు భారీ గోల్ఫ్ కోర్స్ ఉండటం  ప్రస్తుతం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కొన్న భవనంలో ప్రత్యేకతలు. ఒక చిన్న ముచ్చట తీర్చుకోవడానికి మరి ఇంతలా ఖర్చు పెట్టాల అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఈ ప్రపంచ సంపన్నుడిగా ఈ భవనంతో పాటు ఇప్పటికే వాషింగ్టన్ డిసి లాంటి అమెరికన్ తీర ప్రాంతాల్లో కూడా.. ఎన్నో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఇక ఈ సంపన్నుడు ఖర్చులు చూసి ప్రస్తుతం సగటు మనిషి నువ్వేరా పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: