ఐదు రోజుల పాటు ఐటి శాఖ అధికారులు జరిపిన దాడులపై తెలుగుదేశంపార్టీ విచిత్రమైన వాదన మొదలుపెట్టింది. తమ పార్టీ వాళ్ళను రక్షించుకోవటానికి ఎంత అడ్డుగోలు వాదనకైనా రెడీ అయిపోయింది. ఇందులో భాగంగానే  టిడిపి నేతల్లో ఒకొక్కరు బయటకు వచ్చి తమ పిచ్చి వాదనలు మొదలుపెట్టారు. చంద్రబాబునాయుడు దగ్గర పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ దగ్గర దొరికింది రూ. 2.63 లక్షలు మాత్రమే అని  ఐటి శాఖ పంచనామాలో తేలిపోయిందంటూ ఊదరగొట్టటం మొదలుపెట్టారు.

 

పంచనామాలో  దొరికింది 2.63 లక్షలే కావచ్చు. కానీ ఇదే ఐటి శాఖ జారీచేసిన మొదటి ప్రెస్ రిలీజ్ లో లెక్కల్లో వివరించలేని రూ. 83 లక్షల డబ్బు, రూ. 71 లక్షలు విలువైన నగలు దొరికినట్లు స్పష్టంగా చెప్పింది. అదే నోట్ లో  25 బ్యాంకు లాకర్లు గుర్తించినట్లు చెప్పారు.  లెక్కల్లోకి రాని,  బ్లాక్ మనీగా గుర్తించిన రూ . 2 వేల కోట్ల  అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు చెప్పటం గమనార్హం.

 

అదే సమయంలో  ఐటి శాఖ దాడులు చేసిన కంపెనీలు, వ్యక్తులంతా కూడా టిడిపి వాళ్ళవే. ఐటి శాఖ దాడులు జరిపిన మూడు కంపెనీలు టిడిపి నేతలవే. ముగ్గురు నేతలతో పాటు పెండ్యాల ఇంటిపైన కూడా దాడి జరిగింది. దాడి జరిగింది నలుగురు వ్యక్తుల ఇళ్ళు, ఆఫీసులపైనే అయినా బాగా హైలైట్ అయ్యింది మాత్రం శ్రీనివాస్ మాత్రమే ఎందుకంటే పెండ్యాల చంద్రబాబు దగ్గర  పిఏ, పిఎస్ గా పదేళ్ళు పనిచేశాడు కాబట్టే.

 

ఐటి శాఖ తాజాగా రిలీజ్ చేసిన పంచనామాలోని రూ. 2.63 లక్షల డబ్బును పట్టుకుని టిడిపి నానా గోల చేసేస్తోంది. వైసిపి నేతలెవరు కూడా తమంతట తాముగా రూ. 2 వేల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేయలేదు. ఐటి శాఖ ఇచ్చిన రిలీజ్ ఆధారంగానే ఆరోపణలు చేసింది. అసలు రూ. 2.63 లక్షల డబ్బు కోసం మాత్రమే అయితే ఐదు రోజులు సోదాలు ఎందుకు చేసినట్లు ? ఏదేమైనా జరిపిన దాడులపై  ఐటి శాఖ మరింత స్పష్టత ఇస్తేనే బాగుంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: