అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు... ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సిందే నమ్మకం.. సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఇద్దరి మధ్య ఎంతో నమ్మకం ఉండాలి. నమ్మకం పోయి అనుమానం వచ్చింది అంటే ఇక భార్య భర్తల సంసారం కాస్త ప్రతి క్షణం నరకంగా  మారిపోతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ ఓ భర్త కు భార్యపై విపరీతమైన అనుమానం. తన భార్యకు నలుగురితో వివాహేతర సంబంధం ఉందని తెగ అనుమానం పెంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడం... ఊరికే గొడవలు పడడం లాంటివి చేసేవాడు. ఇక చివరికి అనుమానం మరింత పెరిగి పోయి ఎంత దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... కెన్యా కు చెందిన డెన్నిస్ ముమో  అనే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతడికి మామూలుగానే అనుమానం ఎక్కువ. అయితే వ్యాపార పనుల తరచు ఊళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాను తరచూ ఊళ్లకు వెళ్తుండటంతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని అనుమానం పెరిగి పోయింది ఆ వ్యక్తికి.ఏదో ఒక్కరితో  కాదు ఏకంగా నలుగురు తో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించే వాడు. దీంతో తాను ఊరికి వెళ్ళేటప్పుడు భార్య జననాంగం దగ్గర జిగురు పదార్థం రాసి సీల్ చేసేవాడు. అయితే తనపై అనుమానం పడొద్దని తాను ఏ తప్పు చేయడం లేదని భార్య భర్త వేడుక ఉన్నప్పటికీ.. అతగాడి తీరులో మాత్రం మార్పు ఉండేది కాదు. 

 

 

 ఇక తాజాగా మరోసారి వ్యాపార నిమిత్తం ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పటిలాగే జిగురు పదార్థాన్ని తన భార్య యోని దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక అతడు వెళ్లిపోయిన తర్వాత తన భార్యకు భర్త పెట్టిన జిగురు కారణంగా భరించలేనంత మంట పుట్టింది. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళింది ఆ మహిళ. ఇక అక్కడ ఆ మహిళను పరీక్షించిన వైద్యుడు ఆ మహిళ పరిస్థితి చూసి ఖంగు తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు భర్త  తీరు చూసి షాకవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇక అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే విచారణలో తన భార్యకు నలుగురితో వివాహేతర సంబంధం ఉంది అంటూ ఆరోపించాడు సదరు భర్త. దీనికి ఆధారాలు చూపించాలంటూ  పోలీసులు అడగడంతో ఆధారాలు లేవని చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కటకటాల వెనుకకు తోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: