మామూలుగా అయితే ప్రయాణికులు ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వివిధ కంపార్ట్ మెంట్లలో తమకు నచ్చిన విధంగా ట్రైన్ లో టికెట్లు బుక్ చేసుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు జనాలు. అయితే ఇప్పుడు వరకు మనుషులు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం చూశాం  కానీ దేవుడు ట్రైన్ టికెట్ బుక్ చేయడం ఎప్పుడైనా చూసారా. దేవుడు ట్రైన్ టికెట్ బుక్ చేయడం ఏంటి... దేవుడు ఏమైనా మనిషా... ట్రైన్లో ప్రయాణించడానికి... అంటారా... ఇక్కడ మాత్రం దేవుడు ట్రైన్ లో ఒక సీట్ ని బుక్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ స్టోరి ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కాశీనుంచి మహాకాల్  ఎక్స్ప్రెస్ ప్రారంభించారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో భక్తులతో పూజలు అందుకునే దేవుడు శివుడు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ట్రైన్ లో ఒక సీటును పూర్తిగా శివుడికి రిజర్వ్ చేశారు రైల్వే అధికారులు. సీటును  పూలతో డెకరేట్ చేశారు. ఈ సీట్లో మొత్తం దేవుడి పటాలు పెట్టి పూజలు చేసారు. ఇది మహా శివుడి కోసం రిజర్వు చేసిన సీట్  అని అక్కడ రాసి పెట్టారు అధికారులు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్  పైకి ఎక్కకూడదు అంటూ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎన్ని కొత్త ట్రైన్లు ప్రారంభించినప్పటికీ ఏ ట్రైన్ లో కూడా ఇలా జరగలేదు తాజాగా మహాకాల్  ఎక్స్ప్రెస్ రైల్లో మాత్రం శివుని ప్రత్యేకంగా ఒక సీటు రిజర్వు చేసి  ప్రత్యేక పూజలు చేశారు. నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన మహాకాల్  ఎక్స్ప్రెస్ రైలు రెండు రాష్ట్రాలు 3 జ్యోతిర్లింగాలను కవర్ చేస్తూ వెళ్తుంది. 

 

 

 ఇండోర్ లోని  ఓంకారేశ్వర్,  ఉజ్జయిని లోని మహాకాళేశ్వర్ ఆలయాలను కవర్ చేస్తూ కాశీలోని విశ్వనాథ ఆలయం చెంతకు తీసుకెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్ రైలు. ఈరైలు ఉత్తర ప్రదేశ్లోని వారణాసిని నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. అందుకే ఈ ట్రైన్ పేరు కాశీ మహాకాల్  ఎక్స్ప్రెస్ అని పెట్టారు అధికారులు. కాగా  ట్రైన్ లో  బి5 కోర్టులో  సీట్ నెంబర్ 64 పూర్తిగా శివునికోసం రిజర్వ్ చేసారూ  అధికారులు. అయితే ఈ సీట్  కొంతకాలం వరకే మొత్తం శివుడికి రిజర్వు చేసి నా...  లేకపోతే పర్మినెంట్ గా  దేవుడికి కేటాయించాల అనే  దానిపై కూడా అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా కాశీ మహాకాల్  ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రతి కోచ్ లో  భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాకుండా ఈ ట్రైన్ లో ఇద్దరు ప్రైవేటు గార్డుల భద్రత కూడా కల్పించారు. ఇక ఈ ట్రైన్లో కేవలం శాఖాహార భోజనం మాత్రమే ప్రయాణికులకు సప్లై చేస్తారు. వారానికి మూడు రోజులు మాత్రమే ఈ ట్రైన్స్ తిరుగుతూ  ఉంటుంది. మొత్తంగా ఈ ట్రైన్ 1131 కిలోమీటర్లు కవర్ చేస్తూ ఉంటుంది. కాగా ఈ ట్రైన్ ఒక్కసారి బయలుదేరి గమ్యాన్ని చేరుకోవడానికి 19 గంటల సమయం పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: