రాజకీయాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఎవరిని ఏ విధంగా బుట్టలో వేసుకోవాలో... ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అందుకే తెలంగాణా గవర్నర్ గా పని చేసిన నరసింహన్ కెసిఆర్ కి అన్ని విధాలుగా సహకరించారు. నరసింహన్ ని మార్చాలా అని కేంద్రం అడిగినప్పుడు, చంద్రబాబు వద్దులే ఉంచండి అన్నారట 2014 లో అధికారంలోకి వచ్చిన కొత్తలో. అప్పుడు కెసిఆర్ అంటే నరసింహన్ ని కాస్త అయిష్టం ఉండేది. చంద్రబాబుకి మద్దతుగా ఉండే వారని కెసిఆర్ కూడా కాస్త దూరం పాటించారు. 

 

ఆ తర్వాత నరసింహన్ కెసిఆర్, సోదరులు అవ్వడం, పదే పదే రాజభవన్ కి వెళ్ళడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని దేశంలో ఏ రాష్ట్రంలో గాని ఏ ముఖ్యమంత్రి ఒక గవర్నర్ ని అన్ని సార్లు కలవలేదు. నెలకి రెండు సార్లు అయినా గవర్నర్ తో కెసిఆర్ భేటీ అంటూ ఏదోక వార్త వచ్చేది. పుష్ప గుచ్చాలు, శాలువాలు అదనం. పట్టు వస్త్రాలు కూడా. అదే కెసిఆర్ ని కేంద్రానికి దగ్గర చేసింది. నరసింహన్, కేంద్రంలో జేమ్స్ బాండ్ గా చెప్పుకునే అజిత్ దోవాల్ మంచి స్నేహితులు. కలిసి ఉద్యోగం కూడా చేసారు. 

 

దీనితో కెసిఆర్ ని కేంద్రానికి దగ్గర చేసారు. రాష్ట్రంలో బిజెపి నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా సరే కెసిఆర్, మోడీ మనిషే అనేది చాలా మందికి అనుమానం. అందుకే అనుకుంట ఆయన అంత ధైర్యంగా ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కెసిఆర్ దూకుడుగా ఉన్నారు. అందరిని కలపాలి అని భావిస్తున్నారు. కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలను ఏకం చెయ్యాలి అనేది కెసిఆర్ ఆలోచన. ఇప్పుడు దాన్ని మోడీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

కెసిఆర్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలను దూరం చెయ్యాలి అనేది మోడీ ప్లాన్. దానికి తోడు జమిలీ ఎన్నికల కోసం ప్రాంతీయ పార్టీలను ఒప్పించాలి. అందుకే కెసిఆర్ తో మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ అనే మాట మాట్లాడించారని, కెసిఆర్ వ్యూహాలు మోడికి ఈ విషయంలో నచ్చి ముందుకి వెళ్ళాలి అని కూడా సూచించారని సమాచారం. ఎందుకంటే కెసిఆర్ కి కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు కాబట్టి. అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: