ఉద్దేశపూర్వకంగా అన్నారో.. యథాలాపంగా అన్నారో తెలియదు కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. తనకు రాజకీయాలు రిటైర్ మెంట్ ప్లాన్ కాదని ఆయన కామెంట్ చేయడం ఎవరిని ఉద్దేశించి అన్నారో అన్న చర్చ జరుగుతోంది.

 

 

ఇంతకీ పవన్ ఏమన్నారంటే.. “ నేను సినిమాల్లో నుంచి రిటైర్ అయ్యే సమయంలో.. మనవళ్లు పుట్టాక రాజకీయాలను ఎంచుకోలేదు.. ఇంకా సినిమా అవకాశాలు బాగా ఉన్న సమయంలోనే జనం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. మరి ఇక్కడ రిటైర్ మెంట్ సమయంలో రాజకీయాలు ఎంచుకున్న సినీ ప్రముఖులు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు ఎన్టీఆర్ కాగా.. ఇంకొకరు చిరంజీవి.

 

 

ఎన్టీఆర్, చిరంజీవి ఇద్దరూ దాదాపు రిటైర్ మెంట్ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ మనవళ్లు పుట్టాకే రాజకీయాల్లోకి వచ్చారు. సో.. ఇప్పుడు పవన్ ఈ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి అన్నాడన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లో జరుగుతోంది. పవన్ తన విషయం తాను మాట్లాడుకోకుండా ఇతరుల గురించి కామెంట్ చేయడం ఎందుకని ఎన్టీఆర్, చిరు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

 

 

పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. “ భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనే.. పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయేది కాదని.. ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకునేది. కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చా.. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. ప్రజల మనసులు గెలుచుకోగలిగాం.. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయాయి..దానిని మనమే శుభ్రం చేయాలి..అన్నారు జనసేనాని పవన్ కల్యాణ్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: