ఒక వ్యక్తి సాధించిన విజయాలు మాత్రమే అందరికి తెలుస్తాయి. ఆ వ్యక్తి సాధించిన వైఫల్యాలు మాత్రం వెలుగులోకి రావు. ఎవరైన విజయం సాధించినప్పుడు ఆ వ్యక్తి విజయంలో తమ పాత్ర ఉందని చాలామంది చెపుతూ ఉంటారు. అయితే పరాజయం ఎదురైనప్పుడు మాత్రం ఆ పరాజయానికి ఆ వ్యక్తి మాత్రమే కారకుడు అంటూ చాలామంది తమ బాధ్యతలనుండి తప్పించుకుంటారు.


ప్రతి ప్రయత్నంలోనూ గెలవ వలసిన అవసరం లేదు. కొన్ని పోరాటాలలో ఓడినా ఆ ఓటమిని గెలుపు గానే భావించాలి. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక అవడానికి ముందు 18 సార్లు ఎన్నికలలో ఓడిపోయాడు. విద్యుత్ బల్బును కనిపెట్టే ప్రయత్నాలలో థామస్ ఎడిసన్ కొన్ని వందల సార్లు పరాజయం చెందాడు.


ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఇష్టమైన ‘కె ఎఫ్ సి’ రెస్టారెంట్ అనేక సంవత్సరాలు నష్టాలలో నడిచింది అన్న విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం. దీనినిబట్టి గొప్ప విజేతలు అంతా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించలేదు అన్న విషయం స్పష్టమౌతుంది.


వాస్తవానికి ఓటమి అన్న విషయం వాయిదా పడ్డ గెలుపు మాత్రమే అన్న భావనలోకి మనిషి వెళ్ళగలిగినప్పుడు మాత్రమే విజయం లభిస్తుంది. అందుకే చాలామంది అనుకొనే విధంగా ఓటమి చెడ్డది కాదని అది మనలోని కసిని మరింత పెంచుతుంది అని అంటారు. విజయం సాధించిన తరువాత కన్నా ఆ విజయం కోసం చేసే ప్రయత్నాలలోనే పూర్తి విజయం ఉంటుంది. అంతేకాదు ఓటమి ఎంజాయ్ చేయగల వ్యక్తికి మాత్రమే ఆ తరువాత విజయం లభిస్తుంది. అయితే కొంతమంది తొలి ప్రయత్నంలోనే విజయం సాధించే పరిస్థితులు ఉంటాయి. ఓటమి పనికిరాని పదం కాదు అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఏ వ్యక్తికైనా విజయం లభిస్తుంది. అందుకే ప్రయత్నం ఆపనంతవరకు మధ్యలో ఓటమి ఎదురైనా ఆ ఓటమి విజయాన్ని ఆపి ఆ తరువాత వచ్చే విజయాన్ని ఆపలేదు అని అంటారు. అందుకే ‘పరాజయం పరాభవం కాదు’..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: