ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా 9 నెలలు కూడా పూర్తికాకముందే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పోరాటాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శిస్తూ టీడీపీ నేతలు రోడ్లెక్కుతున్నారు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఇసుక సమస్య, అన్నా క్యాంటీన్ల రద్దు, టీడీపీ కార్యకర్తలపై దాడులు, రివర్స్ టెండరింగ్, ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియం అమలు, ఆర్టీసీ ఛార్జీలు పెంపు, రేషన్, పెన్షన్ల తొలగింపు ఇలా పలు అంశాలపై టీడీపీ ఆందోళనలు చేసింది.

 

ఇక రెండు నెలల నుంచి అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్ధతుగా టీడీపీతో పలు విపక్ష పార్టీలు ఉద్యమం చేస్తున్నాయి. అయితే విపక్షాలు, అమరావతి రైతులు ఎంత ఉద్యమం చేసిన, ప్రభుత్వం మాత్రం తమ పని తాము సైలెంట్‌గా చేసుకుంటూ వెళుతుంది. ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చారని, ప్రజలు మద్ధతు తమకే ఉందని చెబుతూ వైసీపీ ప్రభుత్వం పలు నిర్ణయాలని అమలు చేసుకుంటూ ముందుకెళుతుంది.

 

అయితే వైసీపీ తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనవని, వీటి వల్ల రాష్ట్రం నష్టపోతుందని విషయాన్ని ప్రజలకు స్ట్రాంగ్‌గా చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇలా ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూనే, దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 19 నుంచి 45 రోజుల పాటు 13 జిల్లాలని కవర్ చేసేలా ముందుకు సాగాలని రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.

 

ఇక ఈ యాత్రని టీడీపీకి కంచుకోటగా ఉండే పర్చూరులోనే మొదలుపెట్టాలని టీడీపీ అధిష్టానం ఫిక్స్ అయింది. అయితే బాబు పర్చూరులోనే యాత్ర ప్రారంభించడానికి పెద్ద వ్యూహమే ఉందని అర్ధమవుతుంది. పర్చూరు నియోజకవర్గం అమరావతికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా పర్చూరుకు అటు ఇటు ఉన్న చీరాల, అద్దంకి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

 

దీంతో పర్చూరు నుంచి యాత్ర మొదలుపెడితే బాబుకు అదిరిపోయే స్పందన రావడం ఖాయం. ఇక ఈ స్పందన బట్టి బాబు తర్వాత పర్యటించే నియోజకవర్గాల్లో మంచి రెస్పాన్స్ రావోచ్చు. అలాగే రాష్ట్రంలో టీడీపీకి పాజిటివ్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టోచ్చని చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: