సాధారణంగా ప్రముఖ షాపింగ్ మాల్స్ లో భద్రత ఎక్కువగా ఉంటుంది. నిత్యవసర వస్తువులు అమ్మే ప్రముఖ షాపింగ్ మాల్స్ లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఎప్పటికప్పుడు అక్కడి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటారు. కంది పప్పు నోట్లో పెట్టుకున్నా, పల్లీలు రెండు తిన్నా సరే వాళ్ళు అడ్డు పడుతూ ఉంటారు. ఇక చిన్న పిల్లలు వెళ్ళినప్పుడు కూడా తల్లి తండ్రులు అప్రమత్తం గా ఉంటారు పిల్లలను తీసుకువెళ్ళినప్పుడు. ఎక్కడా ఏ వస్తువు పిల్లలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలియకుండా తీసినా సరే, అక్కడ ఉండే సెన్సార్ లు పట్టేస్తు ఉంటాయి.

 

అలాంటి వాటిల్లో దొంగతనాలు చేయడం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కాని ఒక యువకుడు చిన్న చాక్లెట్ దొంగతనం చేసాడు. అవును హైదరాబాద్ లోని డీమార్ట్ లో ఇదే జరిగింది. ఒక యువకుడు చాక్లెట్ దొంగతనం చేసాడు అని దాడి చేసారు. సోమవారం హైదరాబాద్ లో దారుణం జరిగింది. డీ మార్ట్ లో చాక్లెట్ దొంగలించడంతో ఒక విద్యార్ధిపై దాడి చేసారు. హయత్ నగర్ లో ఇంటర్ చదువుతున్న లావుడ్య సతీష్ డీ మార్ట్ కి వెళ్ళాడు. అక్కడ చాక్లెట్ దొంగతనం చేసాడు. 

 

దీనిని గుర్తించిన అక్కడి సిబ్బంది అతని పై దాడి కి దిగారు. ఈ దాడిలో సతీష్ పై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో సతీష్ ప్రాణాలు కోల్పోయాడు. దీనితో అతని బందువులు స్నేహితులు ఆందోళన కు దిగారు. డీ మార్ట్ వాళ్ళు దాడి చేయడం తోనే చనిపోయాడని తల్లి తండ్రులు ఆరోపించారు. హైదరాబాద్ వనస్థలీపుర పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన కు సంబంధించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో అతని పై దాడి జరిగింది అని వైద్యులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: