చైనాను వణిస్తున్న కరోనా వైరస్ తగ్గిపోవాలి.. కరోనా నుంచి చైనా కోలుకోవాలి.. ఇదీ భారత దేశం చేస్తున్న ప్రార్థనలు .. చైనా కోసం భారత్ ఎందుకు అంతగా ఆలోచిస్తోందంటారా.. అందుకూ కారణం ఉంది. ఎందుకంటే.. భారత్ వాణిజ్యం ఎక్కువగా చైనాతోనే లింకప్ అయ్యి ఉంది. భారతదేశానికి అతి పెద్ద వ్యాపార భాగస్వామి చైనాయే.

 

 

2018-19లో భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతుల్లో 14 శాతం ఒక్క చైనా నుంచే వచ్చాయి. అంతే కాదు.. మనం ఎగుమతి చేసే వస్తువుల్లో చైనాకు కూడా గణనీయంగానే వెళ్తాయి.గతేడాది భారత్‌ చేసిన ఎగుమతుల్లో అయిదు శాతం చైనాకు వెళ్లాయి. అందుకే.. చైనాలో కరోనా తగ్గిపోవాలని భారత్ కోరుకుంటోంది. కరోనా సమస్య ఎక్కువ కాలం కొనసాగితే ఆదేశంతో మన ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తాయి.

 

 

మరో పెద్ద సమస్య ఏంటంటే.. చైనాలో కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గి.. విడిభాగాల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి అక్కడి సరఫరాదారులు ధరలు పెంచేశారు. సో.. దీని ప్రభావం భారత్ వంటి దేశాలపైనా పడింది. భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగి, ఉత్పత్తి తగ్గుతుంది. దీని ద్వారా ఉద్యోగాల్లో కోత పడుతుంది.

 

 

ఒక్క మనమే కాదు.. ప్రపంచంలో చైనాపై ఆధారపడి చాలా దేశాలు ఉన్నాయి. ఎందుకంటే.. ప్రపంచ జీడీపీలో 15 శాతం చైనా ద్వారానే లభిస్తోంది. ఇప్పుడు చైనా కుదేలైతే.. ఆ ప్రభావం మిగిలిన దేశాలపైనా పడుతుంది. నేడు ప్రపంచ దేశాల్లో ఉత్పత్తయ్యే సరకుల్లో 10.4 శాతాన్ని చైనా దిగుమతి చేసుకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: