ఒకప్పుడు మీడియా అంటే పత్రికారంగానిదే గుత్తాధిపత్యం. ప్రింటులో ఏది వస్తే అదే నిజమని జనం నమ్మేవాళ్లు. టీవీల రాకతో సీన్ కాస్త మారింది. ఇక ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ప్రింటు మీడియా హవా తగ్గింది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా రాకతో మీడియా రంగంపై గుత్తాధిపత్యం పోయింది. గతంలో పత్రికలను అడ్డుపెట్టుకుని థాట్ పోలీసింగ్ జరిగేది.

 

తమకు అనుకూలమైన పార్టీలను, వ్యక్తులను హీరోలుగా చిత్రీకరించడం.. తమకు నచ్చని పార్టీలను, వ్యక్తులను విలన్లుగా చిత్రీకరించే పోకడ చాలా ఎక్కువగా ఉండేది. కానీ డిజిటల్, వెబ్, సోషల్ మీడియా వచ్చాక సత్తా ఉన్న ప్రతి ఒక్కడూ జర్నలిస్ట్ గా మారిపోతున్నారు.

తమ భావాలు స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. అంతే కాదు.. పత్రికా కథనాల వెనుక అసలేం జరుగుతోంది. ఆ రాతల అంతరార్థమేంటో సవివరంగా పాఠకులకు వివరిస్తున్నారు.

 

 

ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ రాతలపైనా సోషల్, వెబ్, డిజిటల్ మీడియాలో పోస్టు మార్టం జరుగుతోంది. ఆయన ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో తన సుదీర్ఘ రాజకీయ విశ్లేషణ అందిస్తున్నారు. కానీ అదంతా చంద్రబాబును వెనకేసుకొచ్చేదిగా.. టీడీపీకి అనుకూలంగా ఉంటోందన్నవాదన ఉంది.. అంతే కాదు.. అదే సమయంలో జగన్ ను విలన్ గా పాఠకుల మనసుల్లో చిత్రీకరించే ప్రయత్నం కొన్నేళ్లుగా చేస్తున్నారన్న విమర్శ ఉంది.

 

 

కాస్తో కూస్తో అవగాహన ఉన్న పాఠకులకు అసలు వాస్తవం తెలిసేది.. కానీ పాపం.. కొందరు అమాయక పాఠకులు ఆర్కే రాతలను నిజమే కాబోలనుకునే ప్రమాదం కూడా ఉండేది. అందుకే ఇప్పుడు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లు.. ఆర్కే కొత్తపలుకు వెలువడగానే ఆర్కే రాతల్లోని కుతంత్రాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు . అసలు లోగుట్టు ఏంటో బయట పెట్టేస్తున్నారు. కానీ పాపం.. ఆర్కే ఇంకా.. అది పూర్తిగా గమనించారో లేదో తెలియదు కానీ.. ఇంకా తనదైన చంద్రబాబు అనుకూల, జగన్ వ్యతిరేక ధోరణితోనే పుంఖానుపుంఖాలుగా రాసుకుంటూ పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: