సాధారణంగా మనిషి మాత్రమే కాదు ఇతర ఏ జంతువులకైనా పాము అంటే చచ్చేంద భయం.  ఒక్కసారి పాము కాటు వస్తే.. యమలోకానికి టిక్కెట్టు తీసుకున్నట్లే లెక్క.  ఎవరో అదృష్టవంతులు మాత్రమే సకాలంలో వైద్య చికిత్స అందుకొని బయట పడ్డారు ఉన్నారు.  అయితే పాములు అటవీ ప్రాంతంలోనే కాదు మన ఇళ్ల మద్యల్లో కూడా అప్పుడప్పుడు తారసపడుతుంటాయి.  అయితే అలా  వచ్చినపుడు  పాములను పట్టుకోవడంలో సిద్ధహస్తులను పిలిపించి వాటిని పట్టిస్తాము.  అలా పాములు పట్టేవారు కొంత చార్జీ చేస్తుంటారు.  ఇలా పాములు పట్టడంలో ఎంత సిద్దహస్తులైనా కొన్ని సార్లు పాము కాటుకు బలి అవుతున్న విషయం తెలిసిందే.

 

అదృష్టం ఉంటే బతికిపోతారు.. లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటారు.  తాజాగా  కేరళకు చెందిన సురేష్ అనే వ్యక్తి పాములను ఎంతో ఒడుపుగా.. నైపుణ్యంతో పట్టుకోవడం ఆయనకు తెలిసిన విద్య.  ఇటీవల కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. పాములను పట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన సురేశ్ ఇప్పటికి ఓ 50 వేల పాములను పట్టుకున్నాడు.  అలాంటి సురేష్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల ఆయన్ని  ఓ రక్త పింజర కాటు వల్ల అతను ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.  ఎలాంటి పాములనైన ఒడిసిట్టకునే ఈ నేర్పరి రక్తపింజరి విషయంలో ఎలాంటి పొరపాటు చేశాడో కానీ.. ఆ భయంకర విష సర్పం సరేష్ ని కాటు వేసింది.

 

డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే అది పని చేయలేదు. ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటంతో ఆ ఇంజక్షన్ ఇప్పుడు పనిచేయడం లేదు.  అయితే రక్తపింజరి విషయం అతను తీసుకుంటున్న యాంటీ వీనమ్ ఇంజక్షన్లు ఏమాత్రం పనిచేయకుండా ఉన్నాయని డాక్లర్లు అంటున్నారు.  ఇక మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు చెప్పారు.  సురేష్ మంచి ఆరోగ్యంతో తిరిగి రావాాలని సన్నిహితులు, బంధువు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: