తల్లిదండ్రులకు పిల్లలంటే బోలెడంత ప్రేమ ఉంటుంది. వారు ఏం అడిగినా తెచ్చి ఇవ్వడానికి వెనుకాడరు. తల్లి బిడ్డను తొమ్మిది నెలలు తన గర్భంలో మోస్తే.. తండ్రి ఆ బిడ్డకు రెక్కలొచ్చే వరకూ కంటికి రెప్పలా కాపాడతాడు. బిడ్డ కోరిక తీర్చడానికి తానెన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉంటాడు. అయితే కొడుకుపై అతిప్రేమే ఓ తండ్రికి శాప‌మైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడా పరిధిలోని కలౌదా గ్రామానికి చెందిన రాంభూపాల్ సింగ్ వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు లలిత్ (25), అరుణ్ సంతానం. 

 

కొడుకులిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. యితే తండ్రి అతి జాగ్రత్త.. ఇంట్లో నుంచి బయటకు పంపకుండా ఇద్ద‌రినీ గారాబంగా పెంచడంతో లలిత్ మాత్రం కాస్త ముభావంగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. ఆ ప్రభావం అతని సంసార జీవితంపై కూడా పడింది. తన భర్తకు మగతనం లేదంటూ లలిత్ భార్య కొన్నేళ్ల క్రితం అతనిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో లలిత్ మానసికంగా కుంగిపోయాడు. మగతనం లేదని భార్య వెళ్లిపోవడాన్ని లలిత్ జీర్ణించుకోలేకపోయాడు. అయితే తండ్రి ల‌లిత్ ప‌లు హాస్ప‌ట‌ల్లో చూపించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో తానిలా అవ్వ‌డానికి తండ్రే కార‌ణ‌మ‌ని..  చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

 

ఈ నేప‌థ్యంలోనే ఇద్దరూ కలిసి ఒకే గదిలో పడుకున్న సమయంలో తండ్రిని దారుణంగా.. కొడవలితో కిరాతకంగా గొంతుకోసి పరారయ్యాడు. ఉదయాన్నే  రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి మ‌రో కొడుక్ షాక్ గుర‌య్యాడు. రాత్రి తండ్రి పక్కనే పడుకున్న అరుణ్ కనిపించకపోవడంతో హత్య చేసి పరారై ఉంటాడని భావించి పోలీసులకు స‌మాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లలిత్‌ని సమీపంలోని గోడి బచేడా గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు ల‌లిత్‌ను విచారించ‌గా..  తాను సంసారానికి పనికి రానని తన భార్య విడిచి వెళ్లిపోడంతో మానసికంగా కుంగిపోయాన‌ని.. దానికి కార‌ణం నా తండ్రే అని.. అందుకే ఇలా చేశాన‌ని నేరం ఒప్పుకున్నాడు. చివ‌ర‌కు క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: