సామాన్యుడి పార్టీ గా తెర మీదకు వచ్చి అసామాన్య విజయాలు సాధిస్తూ మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకుంది క్రేజీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ. ఆయన బలాన్ని తక్కువ అంచనా వేసి ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ చెబుతూ వచ్చిన వారి ఊహలకు అందకుండా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సాక్షాత్తు కేంద్ర అధికార పార్టీ బీజేపీని మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయడంలో కేజ్రీవాల్ పార్టీ సక్సెస్ అయింది. ఇప్పుడు దేశమంతా కేజ్రీవాల్ విజయంపైనే చర్చించుకుంటున్నారు. ఈ దశలో ఆయన తన పార్టీని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు. 


ముఖ్యంగా అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు వారికి సమర్థవంతమైన పాలన అందించేందుకు చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధానం నిజంగా స్పూర్తిదాయకమే. ఏపీలో ఆ తరహా వ్యక్తులు ఉన్నా వారు మాత్రం రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగులు, సరైన ముందుచూపు లేకపోవడంతో రాజకీయంగా వెనుకబడి పోయారు. మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, జనసేన పార్టీకి ఇటీవల  రాజీనామా చేసిన మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన లక్ష్మీనారాయణ ఉద్యోగంలో ఉండగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ పేరు అలా ఉండగానే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.  


2019 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నా చివరి నిముషంలో దానిని వాయిదా వేసుకుని జనసేన పార్టీలో చేరారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అయినా ఆయనకు రెండు లక్షల 80 వేలకు పైగా ఓట్లు లభించడంతో లక్ష్మీనారాయణ సత్తా ఏంటో అందరికీ అర్థమైంది. కాకపోతే జనసేన పార్టీలో ఉండడంతో ఆయనకు కొన్ని వర్గాల ఓట్లు పడలేదని విశ్లేషణలు కూడా జరిగాయి. జనసేన నుంచి బయటకి వచ్చేయడంతో ఏదో ఒక బలమైన పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో జేడీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తోంది. 


ఢిల్లీ లో విజయంతో జోష్ మీద ఉన్న కేజ్రీవాల్ ఏపీలో కేజ్రీవాల్ బలమైన నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన చూపు జేడీ మీద పడినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఏపీలో ఎలాగూ ఆప్ ను విస్తరించాలనుకుంటున్నాం కాబట్టి పార్టీ బాధ్యతలు జేడీకి అప్పగిస్తే తగిన న్యాయం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక జేడీ కూడా ఆప్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: