19వ శతాబ్దంలో ఆవిష్కరింపబడ్డ అరుదైన వస్తువుల్లో సైకిల్ ఒకటి.  మనిషి అవసరాల కోసం సైకిల్ ఎంతో ఉపయోగపడుతుంది.  ఒకప్పడు ఇంట్లో సైకిల్ ఉంటే ఎంతో ప్రెస్టేజెస్ గా భావించేవారు.  సైకిల్ తో కేవలం స్వ ఉపయోగాలు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్న విషయం తెలిసిందే.  వ్యాయామానికి సైకిలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.  సైకిల్ అంటే రెండు ఇనుప చక్రాలు, ఇనుముతో తయారు చేసిన గొట్టాలతో ఉంటుంది. దానికి రెండు రబ్బరు టైర్లు, ట్యూబులు ఉంటాయి అని చెబుతాం. 

 

అయితే ఒకప్పుడు సైకిల్ ని ఇప్పుడు ఎన్నో రకాలుగా మాడిఫై చేస్తూ మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు.  స్పోర్ట్స్ సైకిల్ గేర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే సైకిల్ ని ప్రపంచంలో వినూత్నంగా రూపొందించి వాడేవారు ఎంతో మంది ఉన్నారు.  కానీ ఓ వ్యక్తి మాత్రం సైకిల్‌ను చెక్కతో తయారుచేశాడు. చెక్కతో ఎడ్లబండి, కుర్చీల్లాంటి అనేక రకాల వస్తువులను మనం చూస్తుంటాం.   పంజాబ్‌కు చెందిన గురుచరణ్‌సింగ్‌ చెక్కతో ఈ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్‌ను మామూలు సైకిల్‌లానే తొక్కొచ్చు.  అయితే చెక్కతో చేసిన ఈ సైకిల్ ని తొక్కడానికి వీలు ఉంటుందా లేదా అన్న అనుమానం వద్దు.. ఈ సైకిల్ ని ఎంచక్కా తొక్కొచ్చు. 

 

ఈ సైకిల్  ఒకరు కాదు ఇద్దరు కూడా దీనిమీద ప్రయాణించవచ్చు అంటున్నాడు గురుచరణ్. కాగా, గురుచరణ్ 1990 నుంచి చెక్క పరికరాలను తయారు చేస్తున్నాడు. ఇప్పటి వరకు మొక్కల్ని పెంచే కుండీలు, కుర్చీలు, బల్లలు వంటి వాటిని తయారు చేశాడు.  తాను రూపొందించిన సైకిల్ ఎంతో ఉపయోగ పడుతుందని... ఇనుము లేకుండా ఇలాంటి సైకిల్ ఉపయోగం కాస్త కష్టమే అయినా.. ఎంతో సౌకర్యంగానే ఉందంటున్నారు గురుచరణ్.  మొత్తానికి ఈయన చేసిన  చెక్క  సైకిల్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: