రాజకుమారుడు గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై... పోకిరితో సరికొత్త ట్రెండ్ సృష్టించి... దూకుడు తో.. తెలుగు బాక్సాఫీస్ మీద దూకుడు చూపించు... ఇక ఆ తర్వాత శ్రీమంతుడు గా ఊరిని బాగు చేసి.. భరత్ అనే నేను అంటూ రాష్ట్రాన్ని పాలించి...  సరిలేరు నీకెవ్వరు అని నిరూపించిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు నేటితరం సూపర్ స్టార్ గా మారి ఎంతో మంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబు అందం గురించి అయితే ఏం చెప్పినా తక్కువే. 

 

 నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ వన్నె తగ్గని అందం ఒక మహేష్ బాబు కే సొంతం అని చెప్పాలి. ఇకపోతే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా సిగరెట్లు తాగే వారట. అయితే విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉండడంతో పలుమార్లు తండ్రి కృష్ణ హెచ్చరించినప్పటికీ మహేష్ బాబు మాత్రం సిగరెట్లు మానెయ్యలేకపోయారట.ఇక  అలాగే రోజు ఎక్కువగా  సిగరెట్లు తాగుతూ ఉండేవారట మహేష్ బాబు. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో మహేష్ బాబు వెల్లడించినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు జీవితంలోకి నమ్రత వచ్చిన తర్వాత... మహేష్ బాబు కొంచెం కొంచెంగా సిగరెట్లకు దూరం అయ్యారట. 

 


 మహేష్ బాబు సతీమణి నమ్రతా మహేష్ బాబు  ఆరోగ్యంపై ఎంత కేర్ తీసుకుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో సిగరెట్ మాన్పించడానికి నమ్రత బాగానే కష్టపడ్డారట . ఎన్నోసార్లు మహేష్ బాబుకు సిగరెట్ మానిపించడానికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట నమ్రత. అంతేకాకుండా ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకం కూడా తనపై ఎంతో ప్రభావం చూపిందని మహేష్ బాబు చెప్పారు. మొత్తానికి మహేష్ బాబు సతీమణి నమ్రతా వల్ల  సిగరెట్ పూర్తిగా మానేసాడట మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: