టాలీవుడ్ లో తక్కువ సినిమాల్లోనే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. యూత్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ మాటలతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా నోటా డియర్  కామ్రేడ్ లాంటి ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 రోజున వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన  నలుగురు హీరోయిన్లు నటించినప్పటికీ... కావాల్సినన్ని రొమాన్స్ సీన్లు పెట్టినప్పటికీ... ఈ సినిమాపై అంతగా బాద్ ఏర్పడలేదు. ఇక విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా చేరుకోలేక పోయిన విషయం తెలిసిందే. 

 


 అయితే మొదటి నుంచి నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా. కాగా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఫ్లాప్ సినిమాలు వసూలు చేసిన దానికంటే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తక్కువ వసూళ్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలకు ముందు నుంచే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంత  ఆసక్తిగా లేనట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గత చిత్రాలకు ప్రచారం చేసిన స్థాయిలో ఈ సినిమాకు మాత్రం ప్రచారం చేయడం లేదు. విడుదలకు రెండు రోజుల ముందు మాత్రమే ప్రమోషన్స్ ప్రమోషన్స్ తో హోరెత్తించారు విజయ్. అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలే సినిమాలకు విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ఎన్నో రోజుల పాటు ఏదో ఒక విధంగా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. 

 

 మరి విజయ్ దేవరకొండ మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ని అంతగా పట్టించుకోకుండా ప్రచారంలో పాల్గొనడం లేదు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా ప్రమోషన్స్ ని వదిలేసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడని  టాక్ వినిపిస్తోంది. కాగా విజయ్ దేవరకొండ తీరుపై చిత్రబృందం మొత్తం అసంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిట్ ఉంటేనే విజయ్ ప్రమోషన్స్ చేస్తాడని లేకపోతే విజయ్ ప్రమోషన్స్ జోలికి వెళ్లడు అంటూ పలు ఆరోపణలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అంతే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా ఇలా చేయడం సరికాదు అని అంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: