తెలంగాణా రవాణా శాఖా మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి త్రుటి లో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లో కార్లే ఒక దానికి మరొకటి తగిలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీడియాకు అందిన సమాచారం చూస్తే, ఈ ఉదయం అజయ్, పంజాగుట్ట మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఈ సమయంలో ఒక మోటార్ సైకిల్ పంజాగుట్ట జీవీకే మాల్ దగ్గర ట్రాఫిక్‌ పోలీసులను గమనించి వెంటనే వేగంగా వెళ్లి మంత్రి కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీనితో ఒక్కసారిగా కాన్వాయ్ లో గందరగోళం చోటు చేసుకుంది. 

 

బైక్ ని తప్పించే క్రమం లో కాన్వాయ్ లోని వాహనాలు ఒక దానికి మరొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటన లో ఎవరి కి ప్రమాదం జరగకపోగా నాలుగు వాహనాలు దెబ్బ తిన్నాయి. వెంటనే తేరుకున్న మంత్రి భద్రతా సిబ్బంది ఆయన్ను మరో వాహనంలో అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా... మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నట్టు సమాచారం. 

 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు కూకటపల్లి కి చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. కాగా 2018 చివర్లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ, అప్పటి టీడీపీ అభ్యర్ధి, తెరాస లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు మీద భారీ విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించి 2014 తర్వాత ఆయన తెరాస లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేబినేట్ లో రవాణా శాఖా మంత్రి గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: