వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలు చేసే చిల్లర కామెంట్లపై సోషల్ మీడియా వేధికగా ఫైర్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై ఫైర్ విజయసాయి రెడ్డి నేడు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా సరే నిజమే కదా.. బాబోరు ఇంతేకదా అని అనకుండా ఉండలేరు.. అలానే ఈరోజు చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపించాడు విజయసాయి రెడ్డి. 

 

అన్ని దాచుకున్న.. అన్ని ఒక చోటా నోట్ చేసి.. ఆ సిస్టంకు పాస్వర్డ్ పెట్టడం మర్చిపొయాడు చంద్రబాబు.. ఇంత బతుకు బతికి.. పాపం ఇంటెనక అంటే ఇదేనేమో అంటూ ట్విట్ చేశాడు విజయసాయి రెడ్డి. ఇంకా ఈ తరహాలోనే విజయసాయి రెడ్డి అదిరిపోయే ట్విట్.. నెటిజన్లు పొట్ట పగిలేలా ఉండే ట్విట్ చేశారు. 

 

విజయ్ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా అదే తరహాలో ట్విట్స్ పెడుతున్నారు.. అతనిది ఒక బతుకేనా ? బినామీ బతుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇంకా ఈ ట్విట్ కారణంగా కొందరు వైసీపీ టీడీపీ అభిమానులు కూడా చిన్నపాటి ట్విట్టర్ యుద్ధమే జరుపుకున్నారు.. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: