జపాన్‌లో ఆ పండుగకి ఎంతో క్రేజ్ ఉంది..! దాని కోసం జపాన్ వాసులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు..! ఆ పండుగే హడక మత్సూరీ..! జపాన్‌వాసులు ఈ ఫెస్టివల్‌ని నగ్నంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా హడక మత్సూరీ ఘనంగా జరిగింది.
జపాన్‌లో ప్రతీ ఏడాది ఒక డిఫెరెంట్ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగలో నగ్నంగా పాల్గొంటారు జపాన్‌వాసులు.ఈ ఫెస్టివల్‌కు 500 ఏళ్ల చరిత్ర ఉంది. కేవలం గోచీ మాత్రమే కట్టుకుని.. కాళ్లకు రెండు సాక్సులు వేసుకుని ఈ ఫెస్టివల్ పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ నేకెడ్ ఫెస్టివల్లో 10 వేల మందికి పైగా జపానీయులు పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధిలోని హోన్షు ఐలాండ్‌లోని సైదైజీ కన్నోనియాస్ టెంపుల్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో వేలాది మంది పురుషులు బట్టలు లేకుండా పాల్గొంటారు. కన్నోనియాస్ టెంపుల్లో పూజారి 100 బండిళ్ల చెట్ల కొమ్మలు, ఒక రెండు లక్కీ షింగీ కట్టెలను జనంలోకి విసురుతారు. అప్పుడే అసలైన ఈవెంట్ మొదలవుతుంది. ఈ కొమ్మలు, కట్టెల కోసం యువకులంతా పోటీ పడతారు. ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ వాటి కోసం ఎగబడతారు. కొంతమందికి దెబ్బలు కూడా తగులుతుంటాయ్. కాళ్లు, చేతులు కూడా ఇరుగుతుంటాయి. అయినా దేన్ని లెక్క చేయకుండా ఉత్సాహంగా ఈ ఫెస్టివల్ పాల్గొంటారు. ఈ కొమ్మలు, కట్టెలు దొరికితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం.
పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సంతాన భాగ్యం కలగాలని ఈ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. వేలాది మంది ఇందులో ఈ ఫెస్టివల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. జపాన్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి టూరిస్టులు కూడా వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా నెకేడ్ ఫెస్టివల్‌ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు.