ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో చోరీలు చేస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా ఈ తరహా చోరీలు బాగానే జరుగుతున్నాయి. చైన్  స్నాచర్స్ తో ఆ మద్య తెలుగు రాష్ట్రాల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు.  చడ్డీ గ్యాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆ మద్య హైదరాబాద్ నగరంలో గతంలో ఓ సారి కుషాయిగూడలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో వికారాబాద్ జిల్లాలోనూ ఓ బస్సు చోరి అయ్యింది. కాకపోతే ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం దొంగలు ఈజీగా బస్సును చోరీ చేశారు.  తాజాగా బస్సులో కొంత మంది ప్రయాణీకులు ఉండగా చోరీకి గురికావడం షాక్ కి గురి చేసింది.

 

వివరాల్లోకి వెళితే.. తాండూరు డిపోలో బస్సును ఆపి డ్రైవర్, కండర్టర్ భోజనానికి దిగారని చెప్పారు. భోజనం తరువాత వారు వచ్చి చూడగా బస్ కనిపించలేదని దాంతో డ్రైవర్ , కండక్టర్ డిపో మేనేజర్ రాజశేఖర్ కు తెలిపారని చెప్పారు.  విషయం తెలుసుకున్న బస్ మేనేజర్ వెంటనే సెక్యూరిటీని పంపించి బస్సు ను వెతికించారు.  సరిగ్గా అదే సమయానికి ఓ ప్రయాణికుడు బస్సుకు సంబంధించిన సమాచారం ఇచ్చాడని తెలిపారు. అయితే ఓ వ్యక్తి మద్యం తాగి బస్సు డ్రైవర్ స్థానంలో కూర్చొని తానే డ్రైవర్, కండెక్టర్ అని చెప్పి బస్సును నడిపించుకుంటూ తీసుకు వెళ్లాడని అతని ప్రవర్తనలో ఏదో తేడా ఉండటంతో ప్రయాణికులు అతన్ని వారించారని దాంతో బస్సును సిటీ శివారులో రోడ్డుపై వదిలేసి పారిపోయాడని తెలిపారు.

 

బస్సు సమాచారం రాగానే బస్సు డ్రైవర్ ని, కండక్టర్ ను పంపించామని తరువాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అంతే కాదు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు కూడా పోలీస్ ఫిర్యాదు చేశారు.  మొత్తానికి జరిగిన సంఘటన తల్చుకొని ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: