ఇద్దరు ఓకే పార్టీ నేతలు..  ఒక మాజీ ఎమ్మెల్యే అయితే ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే.. కానీ వీరిద్దరికీ అసలు ఎక్కడ పడdu6. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వారెవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీ ఆకర్ష్ లో భాగంగా  టిడిపి పార్టీ లోకి వెళ్లారు. మళ్ళీ 2019 ఎన్నికల సమయానికి వైసీపీలో జాయిన్ అయ్యారు ఎస్వీ మోహన్రెడ్డి. కానీ అప్పటికే ఎస్వీ మోహన్ రెడ్డి  స్థానంలో వైసీపీ పార్టీ హఫీస్ ఖాన్ ను తీసుకొని ఎమ్మెల్యే గా నిలబెట్టింది. దీంతో తాను పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని అంటూ ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఎంతగా వివాదాలు చెలరేగుతున్నాయి. 

 

 గతంలో ఎస్వీ మోహన్ రెడ్డి  ఇతర పార్టీ కార్యకర్తలు తన సమక్షంలో వైసీపీ లో చేరడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా పార్టీలోకి వేరే పార్టీ నేతలను ఎలా చేర్చుకుంటారు అంటూ బహిరంగంగానే లేఖను రాశారు. నువ్వే ఓ కార్యకర్తవి... ఇతర పార్టీ కార్యకర్తలను నువ్వెలా చేర్చుకుంటావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్మిషన్ లేకుండా వైసీపీలోకి వలసలు చెల్లవు అంటూ తెలిపారు. కాగా  ఈరోజు వివాదం ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్న సమయంలో.. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం మొదలైంది. ఈసారి బ్యానర్ల  కారణంగా వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. 

 


 మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  కి చెందిన బ్యానర్లను  అర్ధరాత్రి సమయంలో తొలగించడంతో... మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య మనస్పర్థలు మరోసారి బయటపడ్డాయి. కర్నూలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  సంబంధించిన బ్యానర్ ల నుంచి అర్ధరాత్రి సమయంలో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  మున్సిపల్ అధికారులను నిలదీయడంతో ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ ఆదేశాలతోనే బ్యానర్లను తొలగించామంటూ  పోలీసులు తెలిపారు.ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం కాస్త రోజురోజుకీ మరింత ఎక్కువగా ఉండడంతో ఈ విషయం పార్టీ అధినేత సీఎం జగన్ వరకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త జగన్ వద్దకు వెళ్తే ఇద్దరి మధ్య వివాదం చేయడం ఎలా సద్దుమణిగేలా చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: