అరటి పండు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే దీనితో అనేక ఆరోగ్య ప్రయజనాలున్నాయి. దీనిలో ఫైబెర్ విటమిన్స్ నాచురల్ షుగర్స్ ఫ్రాక్టోస్ లు ఉంటాయి. అందుకే డాక్టర్స్ ఈ అరటి పండును ప్రతిరోజూ తినాలని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అయితే నల్లగా మచ్చలు ఉన్న అరటి పళ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటినే ఎక్కువ తినాలి.అరటి పండ్లు తినడం వలన శరీరంలో తెల్ల రక్త కణాలు మెరుగుపడతాయి. క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది. రోజుకు రెండు అరటి పండ్లు తినడం వలన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకోండి. అయితే ఇవి పసి పిల్ల‌లు తింటే అరుగుతాయా అన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. చిన్న పిల్ల‌ల‌కు అర‌టిపండును ఆరు నెల‌లు వ‌చ్చాక నెమ్మ‌దిగా చిన్న చిన్న‌గా అవాటు చేయాలి. ముందు స‌గం అర‌టిపండుని మిక్సీలో వేసి మ్యాష్ చేసి కొంచం కొంచంగా స్పూన్‌తో తినిపించాలి. దాంతో వారికి అది డైజ‌స్ట్ అవుతుందా లేదా అన్న‌ది మ‌న‌కి తెలిసిపోతుంది. కొంత‌మందికి అర‌టిపండు అర‌గ‌దు దాంతో వాళ్ళు వామిటింగ్ చెయ్య‌డం లాంటివి చేస్తుంటారు. కాబ‌ట్టి ముందు కొంచం కొంచంగా అల‌వాటు చేయాలి. అలాగే చాలా మంది పేరెంట్స్ పండుని చేతిలో ప‌ట్టుకుని చిన్న చిన్న‌గా మెత్త‌గా చేసి పిల్ల‌ల‌కు పెడుతుంటారు. దానివ‌ల్ల మ‌న చేతిక ఉన్న క్రిముల‌న్నీ పిల్ల‌ల క‌డుపులోకి వెళ్ళి లేనిపోని ఇన్‌ఫెక్ష‌న్స్ అన్నీ వ‌స్తాయి. 

 

క‌నుక పిల్ల‌ల‌కు తినిపించేట‌ప్పుడు పైన చెప్పిన విధంగా పండుని మ్యాష్ చేసి స్పూన్‌తో పెట్ట‌డం చాలా మంచిది. దీనిలో సహజమైన యాంటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హార్ట్ బర్న్ ను నివారిస్తుంది. అందుకే ఎప్పుడైనా హార్ట్ దగ్గర మంటగా ఉన్నప్పుడు అరటిపండు తినడం వల్ల వెంటనే బర్న్ తగ్గుతుంది. దీనిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. సోడియం అసలు ఉండదు. రోజు రెండు అరటి పండ్లు తినడం వలన రక్త పోటు అదుపులో ఉంటుంది.

 

అలాగే స్ట్రోక్ నుండి కాపాడుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. ఏనిమియా తో బాధపడే వారిలో ఇనుము ను పెంచి రక్తాన్ని అభివృద్ది చేస్తుంది. అల్సర్ తో బాధపడే వారు అరటి పండ్లు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే డిప్రెషన్ తో బాధపడేవారికి ఇందులో ఉండే సరోటినిన్ హ్యాపీగా ఉండడానికి సహకరిస్తుంది కన్స్తుపేషన్ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. బ్లడ్ సుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను బలపరుస్తుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: