ప్రపంచంలో ఒకప్పుడు యుద్దం అంటూ జరిగితే తుపాకులతో, బాంబులతో జరిగేది. ఆ కాలం కనుమరుగైపోయింది. తర్వాత అణుబాంబులంటూ కొంత హంగామా కొనసాగింది. ఇక ప్రపంచదేశాల ఆలోచన ఇక్కడే ఆగిపోయింది. కానీ చైనా మాత్రం అంతటితో ఊరుకోలేదు.. రహస్యంగా తన ప్రయోగశాలలో ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంది..

 

 

ఇకపోతే నేటికాలంలో యుద్దాలు అంటూ జరిగితే తూపాకుల మోతలు వినబడవు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది జీవాయుధాల శకం. అంతరిక్షంలో శాటిలైట్లను కూల్చేసుకునే కాలం.. ఆర్థిక యుద్ధాలు సృష్టించే యుగం.. ఇలాంటి ప్రమాదకర కాలంలో మనందరం బ్రతుకుతున్నాం. ముప్పు ఎటువైపునుండి ముంచుకు వస్తుందో తెలియదు.. ఎన్ని ప్రాణాలను తీస్తుందో అర్ధం అవదు. కాని జరగవలసిన నష్టం మాత్రం రెప్ప పాటులో జరిగిపోతుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్..

 

 

ఇప్పటికి ఈ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.. అయితే ఎవరు ఊహించని విషయం ఏంటంటే. ఈ వైరస్ గురించి ఓ రచయిత 40 ఏళ్ల నాటి తన నవలలో ప్రస్తావించడం.. ఇదే విషయాన్ని మన దేశంలో బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారని విని ఉన్నాం.. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ కరోనా వైరస్ చైనా రూపొందించిన జీవాయుధమా..? అంటూ చేసిన ట్వీట్‌పై చర్చ జరుగుతున్న నేపధ్యంలో, దానికి రుజువుగా ప్రఖ్యాత అమెరికన్ రచయిత డీన్ కూంట్స్ రాసిన ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్ అనే నవలలోని ఒక పేజీలో ఉన్న విషయాన్ని కూడా ఆ ట్వీట్‌కు జతచేశాడు..

 

 

ఇక ఈ నవల 1981 నాటిది. ఇందులో చైనా రూపొందించిన ‘వుహాన్-400‘ అనే జీవాయుధం గురించిన ప్రస్తావన వస్తుంది.. వుహాన్ అనే సిటీ శివార్లలో చైనీయులు ఈ వైరస్‌ను సృష్టిస్తారని కథాగమనంలో మనం చదువుకోవచ్చు.. ఇకపోతే ఆ రచయిత రాసింది ఒక ఫిక్షన్ నవల అని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే.. టైటాన్ అనే పేరున్న ఓ పెద్ద పడవ మునిగిపోయే ఘటనపై కూడా ఒక నవల వచ్చింది.. ఆ నవల విడుదలైన 14 ఏళ్లకు నిజంగానే ఆ నవలలో చెప్పినట్టే, సేమ్, అదే పేరున్న పెద్ద పడవ టైటానిక్, ప్రమాదానికి గురై మునిగిపోయింది..

 

 

ఇది భవిష్యత్తు దర్శనం కాదు, జోస్యమూ కాదు.. జస్ట్, ఒక కో-ఇన్సిడెన్స్ అనే వారు కూడా ఉన్నారు.. ఏది ఏమైనా, నమ్మిన నమ్మకపోయినా కొన్ని కొన్ని నిజాలు అలా చరిత్రలో రహస్యంగా దాగిపోయాయి. ఇదిగో ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడే వీటిపైన చర్చ సాగడం పరిపాటే గాని, ఏనాటికైన చైనాతో మాత్రం ప్రపంచ దేశాలకు ప్రమాదం ఉంది అన్న వాదన మాత్రం నిజం అంటున్నారు మేధావులు..

మరింత సమాచారం తెలుసుకోండి: